Kohli-Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా ఆదివారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన జరిగింది. ఇద్దరు స్టార్ క్రికెటర్ల మధ్య.. పెద్ద యుద్ధమే జరిగింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) అలాగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) మాజీ సారథి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు కూడా వైరల్ గా మారాయి.
Also Read: Chahal-RJ Mahvash: పెళ్ళాన్ని వదిలేసి.. ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన చాహల్
శ్రేయస్ అయ్యర్ ను టార్గెట్ చేసిన విరాట్ కోహ్లీ
ఐపిఎల్ 2025 టోర్నమెంటు లో భాగంగా… పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Punjab Kings vs Royal Challengers Bangalore ) మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కాస్త ఓవర్ చేశాడు. పంజాబ్ ప్లేయర్లను ఉద్దేశించి రెచ్చిపోయాడు విరాట్ కోహ్లీ. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఉద్దేశించి అసభ్యకర చేష్టలు చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ ను.. ఓ జూనియర్ ప్లేయర్లగా (Junior Players )చూసిన విరాట్ కోహ్లీ… గ్రౌండ్ లో రచ్చ రచ్చ చేశాడు.
మొదట పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేయగా శ్రేయస్ అయ్యర్.. తొందరగానే అవుట్ అయ్యాడు. అయితే పెవిలియన్ కు వెళ్తున్న శ్రేయస్ అయ్యర్ ను ఆటపట్టించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ… తనుదైన స్టైల్ లో శ్రేయస్ అయ్యర్ ను చూసి ర్యాగింగ్ చేశాడు. దీంతో సీరియస్ అయిన శ్రేయస్ అయ్యర్… విరాట్ కోహ్లీతో… గొడవ పెట్టుకోబోయాడు. అంతలోనే విరాట్ కోహ్లీ కాస్త రిలాక్స్ గా కనిపించి నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో… విరాట్ కోహ్లీపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ప్లేయర్ లపై విరాట్ కోహ్లీ తన ఆక్రోసాన్ని చూపిస్తున్నాడని మండిపడుతున్నారు.
Also Read: Krunal-Kohli: నీకు మెంటలా… ఎక్కడ చూస్తున్నావ్.. కోహ్లీ పరువు తీసిన కృనాల్ పాండ్యా
నేహాల్ వధేరా పైన విరాట్ కోహ్లీ కుట్రలు
అటు మరో పంజాబ్ యంగ్ ప్లేయర్ నేహాల్ వధేరా ను(Nehal Whdhera ) కూడా టార్గెట్ చేశాడు విరాట్ కోహ్లీ. నేహాల్ వధేరా రన్ అవుట్ అయిన తర్వాత… అసభ్యకర సైగలతో ర్యాగింగ్ చేశాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన వీడియోలు అలాగే ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. చిన్నస్వామి స్టేడియం లో ( Chinnaswamy Stadium ) అద్భుతంగా నేహాల్ వధేరా ఆడడంతో… కోహ్లీ అతని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
Iyer cooked Kohli after the match.💀 pic.twitter.com/5laYAm14Gk
— Gems of Cricket (@GemsOfCrickets) April 20, 2025