Rajasthan Crime news: ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అత్యాచారం కేసులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ ఆ క్రికెటర్ ఏం చేశాడు? శివాలిక్ చివరి సారిగా ఈ ఏడాది జనవరిలో బరోడా తరపున రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో ఏ జట్టు తరపున ఆడలేదు.
ఎవరా క్రికెటర్?
పైన కనిపిస్తున్న క్రికెటర్ శివాలిక్ శర్మ. వయస్సు 26 ఏళ్లు. సొంతూరు గుజరాత్‌కి చెందినవాడు. బరోడాకు చెందిన ఆల్‌రౌండర్, ఆపై ఎడమ చేతి బ్యాట్స్‌మన్ కూడా. సరిగ్గా 2018లో దేశవాళీ క్రికెట్లోకి అడుగుపెట్టిన ఈ ఆటగాడు వెనుదిరిగి చూడలేదు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 1,087 పరుగులు చేశాడు. లెగ్ బ్రేక్ గూగ్లీతో దేశవాళీ మ్యాచ్‌ల్లో వికెట్లు తీసుకున్నాడు.
శివాలిక్ 13 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 322 పరుగులు, 19 టీ20లు ఆడి 349 పరుగులు చేశాడు. 2023 సీజన్‌కు ముందు ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ టీమ్ శివాలిక్‌ను 20 లక్షల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేసింది. ఆ టోర్నీలో పెద్దగా రాణించలేదు. నవంబర్‌లో జరిగిన మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు.
యువతితో రిలేషన్ షిప్ మాటేంటి?
క్రికెటర్ శివాలిక్ శర్మ వివాహం చేసుకుంటానని చెప్పి ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి అనేసరికి ముఖం చాటేశాడు. దీంతో బాధిత మహిళ జోద్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి సొంతూరు జోధ్‌పూర్ సిటీకి చెందిన యువతి. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడ్ని జ్యుడిషియల్ కస్టడీకి ఆదేశించింది.
ALSO READ: పడకగదిలో భార్యతో క్రూరంగా ప్రవర్తించిన బాడీ బిల్డర్, యువతి మృతి
బాధిత యువతి ఏం చెప్పింది? తామిద్దరం సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయినట్టు తెలిపింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. తనను కలవడానికి చాలాసార్లు శివాలిక్ జోధ్‌పూర్‌కు వచ్చాడని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడని వెల్లడించింది.
ఆ సమయంలో తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, వివాహం అనేసరికి అదిగో ఇదిగో అంటూ పక్కదారి పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలియజేసింది. బాధితురాలి వాంగ్మూలం తర్వాత కేసు నమోదు చేశారు పోలీసులు. ఆపై దర్యాప్తు ప్రారంభించారు. చివరకు వడోదరలో అరెస్టు చేసిన పోలీసులు, జోధ్‌పూర్‌కి తరలించారు.