BigTV English

India vs Pakistan : అణుబాంబులు వేస్తారా? పాకిస్తాన్ బలుపు దిగేలా…

India vs Pakistan : అణుబాంబులు వేస్తారా? పాకిస్తాన్ బలుపు దిగేలా…

India vs Pakistan : పాక్‌కు ఎంత బలుపు అంటే.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. భారత్‌పై దాడులకు ఉసిగొల్పుతుంది. కశ్మీర్‌లో నరమేధం సృష్టిస్తుంది. పహల్గాంలో హిందువులను కాల్చి చంపించింది. ఇంతా చేసి.. సుద్దపూస మాటలు మాట్లాడుతోంది. భారత్ యుద్ధానికి కవ్విస్తోందని.. తమ దేశంపై దాడి చేసే ప్రమాదం ఉందంటూ.. అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీళ్లు కారుస్తోంది. అయితే, మహానటిలా పాక్ ఎంత యాక్టింగ్ చేసినా.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మాత్రం ఆ దేశాన్ని ఏమాత్రం నమ్మలేదు. పైగా మరో నాలుగు మొట్టికాయలు తగిలించి పంపించేశాయి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో దిక్కులేనిదిగా మిగిలింది పాపిస్తాన్.


అణుబాంబులతో బెదిరిస్తారా?

పాకిస్తాన్ అసలేం అనుకుంటోంది? అణుబాంబులు ఉన్నాయి కదాని భారత్‌ మీద వేసేస్తారా? అంత ధైర్యం ఉందా? ఆటంబాబులు వేస్తే ఏమవుతుందో తెలుసా? తెలిసే అణ్వాస్త్రాలు ప్రయోగిస్తాం అని బెదిరించారా? అంటూ పాక్‌ను నిప్పులతో కడిగేసింది UNSC. అసలే పరిస్థితి బాలేదు.. ఇలాంటి సమయంలో క్షిపణి ప్రయోగాలు, యుద్ధ విన్యాసాలు ఎందుకు చేశారంటూ పాక్‌పై మండిపడింది. శాంతి చర్యలకు వెళ్లకుండా.. ఉగ్రవాదులపై యాక్షన్ తీసుకోకుండా.. భారత్‌పై యుద్ధానికి సన్నద్ధం అవడంపై భద్రతా మండలి పాక్‌పై మండిపడింది. వరుస పరిణామాలపై పాక్‌ తప్పక సమాధానం చెప్పాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.


లోపలంతా దబిడి దిబిడే..

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ దూకుడుతో పాకిస్తాన్ బేజార్ అవుతోంది. వీసాలు, సింధూ జలాలు, నో ఫ్లై జోన్, ఇంపోర్ట్స్‌పై బ్యాన్.. ఇలా అష్టదిగ్బంధనంతో పాక్ గిలగిలా కొట్టుకుంటోంది. ఇండియా గిల్లితే గిల్లించుకోకుండా, మూసుకొని ఉండకుండా.. గగ్గోలు పెట్టడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. భారత్ ఏదో చేసేస్తోందంటూ.. మనల్ని దోషిగా చూపించే ప్రయత్నం చేసింది. నేరుగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి కంప్లైంట్ చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని ప్రయత్నించింది. పాక్ కోరినట్టే.. క్లోజ్డ్‌డోర్ హైలెవల్ మీటింగ్ నిర్వహించింది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. గంటన్నర సేపు జరిగిందా మీటింగ్. లోపలంతా దబిడిదిబిడే.

పహల్గాం దాడి భారత్ పనే అట..

పాక్ ఒకటి అనుకుంటే అక్కడ జరిగింది మరోటి. ఇండియానే కుట్ర చేసి పహల్గాంలో దాడి చేయించుకుందట. ఆ దాడిని పాకిస్తాన్ మీద తోసేస్తోందట. ఇదీ పాక్ చేసిన వితండ వాదన. చిన్నపిల్లాడైనా నమ్ముతాడా ఈ కహానీ? ఇలాంటి కామెడీ స్కిట్‌ను భద్రతా మండలిలో ప్లే చేసింది పాకిస్తాన్. వెంటనే సభ్య దేశాలన్నీ పాక్ ఆరోపణను తీవ్రంగా వ్యతికించాయి. పహల్గాం ఉగ్రదాడికి జవాబు చెప్పాల్సిందేనని తేల్చి చెప్పాయి. లష్కరే తోయిబా పాత్రపై పాక్‌ను ప్రశ్నించాయి. టెర్రరిస్టులు మతం ప్రాతిపదికన అమాయకులను చంపడంపై ఆందోళన వ్యక్తం చేశాయి సభ్య దేశాలు.

Also Read : హైదరాబాద్, వైజాగ్‌లో వార్ సైరన్.. హైఅలర్ట్

పాక్‌కు దెబ్బ మీద దెబ్బ

భారత్‌పై అణుబాంబులు వేస్తామంటూ పాకిస్తాన్ బహిరంగంగా బెదిరించడాన్ని UNSC తీవ్రంగా తప్పుబట్టింది. ఇటీవలే మిస్సైల్ టెస్ట్ చేయడం ఏంటని నిలదీశాయి. పాక్ తీరు కరెక్ట్ కాదని స్పష్టం చేశాయి. ఒక్క దేశం కూడా పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయలేదు. భారత్‌తో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సలహా కూడా ఇచ్చాయి. తీర్మానం గట్రా లేకుండా మీటింగ్ క్లోజ్ చేయడంతో.. పాక్‌కు భద్రతా మండలిలో ఎదురు దెబ్బ తప్పలేదు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×