Anantapur News: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిని దారుణ హత్యకు గురైంది. అనంతపుర నగరంలోని మణిపాల్ స్కూల్ బ్యాక్ సైడ్ విద్యార్థినిని మృతదేహం లభ్యమైంది. అమ్మాయిని పెట్రోల పోసి కాల్చి చంపినట్టు తెలుస్తోంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి తమ కూతరు తన్మయి మిస్ అయ్యిందని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకుంటే తమ కూతురు బతికేదని బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇంటర్ విద్యార్థిని మర్డర్ ఘటనలో తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థిని తన్మయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన రోజే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. CC కెమెరాల ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను దొరకబట్టేందుకు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు వివరించారు.
విద్యార్థిని తన్మయి తలపై బలంగా బీర్ బాటిల్ తో కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అమ్మాయిపై అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీని గురించి పూర్తి సమాచారం క్లియర్ కట్ చెబుతామని అన్నారు.
Also Read: భార్య తలను నరికి.. పోలీసుల ముందు?