Visakha Crime News: విశాఖ సిటీ గోపాలపట్నం ప్రాంతానికి కొత్త దంపతుల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో తీగ లాడితే డొంక కదులుతోంది. భార్య ఆత్మహత్య వెనుక.. కర్మ, కర్త, క్రియ అన్నీ ఆమె భర్త నాగేంద్రబాబు అని తేలుతోంది. దీంతో ఈ కేసుపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టేశారు పోలీసులు.
వసంత కేసులో ఏం జరిగింది?
గోపాలపట్నంలో ఆత్మహత్య చేసుకున్న నవ వధువు వసంత కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వసంతను లైంగికంగా టార్చర్ చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. వసంత భర్త నాగేంద్రబాబు ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించాడని తేలింది. భార్యను లైంగికంగా వేధింపులకు దిగేవాడని నిర్ధారణకు వచ్చారు.
శుక్రవారం నాగేంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 28 వరకు ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. అయితే నాగేంద్రబాబును కస్టడీకి తీసుకోవడానికి పిటిషన్ వేయనున్నారు పోలీసులు. నాగేంద్రబాబు నుంచి మొబైల్ ఫోన్ రికవరీ కోసం ల్యాబ్‌కు పంపనున్నారు గోపాలపట్నం పోలీసులు.
నాగేంద్రబాబు ఫోన్ సీక్రెట్ వీడియోలు
శనివారం నాగేంద్రబాబు ఫోన్‌ని ఓపెన్ చేశారు పోలీసులు. అందులో రకరకాల ఏకాంత వీడియోలను గుర్తించారు. నాగేంద్రబాబు ఇంట్లో లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు టాబ్లెట్లు వాడేవాడని తేలింది. వాటికి సంబంధించిన మెటీరియల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమ కూతురు వసంతను నాగేంద్రబాబు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మొదటి నుంచి ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు.
ALSO READ: నడి రోడ్డుపై 5 కిలోల బంగారం చోరీ.. ఇద్దరు దొంగలు ఎలా చేశారంటే?
అసలు స్టోరీ ఏంటి?
విచిత్రం ఏంటంటే గూగుల్ హిస్టరీని చూసి పోలీసులు షాకయ్యారు. నాగేంద్రబాబు ఫోన్ లో వందలాది వీడియోలను గుర్తించారు. గురువారం విశాఖలో విశాఖలో నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. వసంత-నాగేంద్రబాబుకు పెళ్లయి కేవలం 11 నెలలు మాత్రమే అయ్యింది. మొదట్లో ఈ దంపతులు బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు.
భార్య వసంతను వెరైటీగా వేధించడ మొదలుపెట్టారు. వీడియోల మాదిరిగా తనను సుఖ పెట్టాలని ఒత్తిడి తెచ్చేవాడు. మొదట్లో ఈ విషయాన్ని లైట్ గా తీసుకుందట వసంత. రానురాను భర్త ఆగడాలు పెరిగిపోవడం మొదలైంది. వీలు చిక్కినప్పుడల్లా ఏకాంత వీడియోలను సెల్‌ఫోన్‌లో చూసేవాడు. ఆ విధంగా ఉండాలని భావించేవాడు. ఈ విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు లేకపోలేదు.
చివరకు రీల్‌కు రియల్‌కు తేడా తెలుసుకోలేక పోయాడు. భర్త నాగేంద్రబాబు టార్చర్ రోజురోజుకూ పెరగడతో తట్టుకోలేకపోయింది ఆ ఇల్లాలు. దీనికి ఒకటే శరణ్యమని భావించింది. ఆపై ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచిపెట్టింది.
తమ కూతురు వసంత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలియగానే అల్లుడిపై విరుచుకుపడ్డారు అత్తమామలు, బంధువులు. కావాలనే తమ కూతుర్ని వేధించి చంపేశాడని ఆరోపించారు. కూతురు చనిపోయిందన్న ఆవేదనలో పోలీసులకు ఫిర్యాదు చేశారు వసంత పేరెంట్స్. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా నాగేంద్రబాబు విచారించాడు. ఆయన సెల్ ఫోన్ తీసుకుని పరిశీలించారు. ఆ తర్వాత ఇంటికి గమనించారు.
ముమ్మాటికీ నాగేంద్రబాబు.. తన భార్యను హత్యకు ప్రేరేపించి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేశారు. నాగేంద్రబాబు తల్లి, తమ్ముడు పరారీలో ఉన్నారు. పోలీసుల విచారణలో నాగేంద్రబాబు గురించి ఎలాంటి కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.