Police : జనాలు సివిల్ పోలీసులకు భయపడతారో లేదో కానీ.. ట్రాఫిక్ పోలీసులను చూస్తే మాత్రం పారిపోతుంటారు. రోడ్డు మీద సూపర్ కాప్.. మన ట్రాఫికన్న. రోజంతా రోడ్ల మీదే నిలబడతారు. పాపం కాసేపు కూర్చోడానికి కూడా ఉండదు. ఎండైనా, వానైనా డ్యూటీ డ్యూటీనే. చాలా సిన్సియర్‌గా పని చేస్తారు. వాళ్లు ఓ నిమిషం పక్కకు వెళితే.. ఇక గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లే. హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ కత్తి మీద సామే. ఇదంతా పాజిటివ్ సైడ్.
పోలీసులకు రూల్స్ ఉండవా?
ట్రాఫిక్ రూల్స్ ఇంత స్ట్రిక్ట్‌గా అమలు చేసే పోలీసులు.. వాళ్లు మాత్రం అస్సలు రూల్స్ పాటించరు. సివిల్ పోలీసులైతే మరీను. చాలామంది ఖాకీలు హెల్మెటే పెట్టుకోరు. నెంబర్ ప్లేట్ కూడా ఉండదు. బండిపై POLICE అని రాయించుకొని దర్జాగా తిరుగుతుంటారు. రాంగ్ రూట్లోనూ వెళ్తుంటారు. ఇక చాలా వరకు పోలీస్ వాహనాలు ట్రాఫిక్ రూల్స్ తరుచూ బ్రేక్ చేస్తుంటాయి. ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టు.. అడ్డదిడ్డంగా వెళ్తుంటాయి. ఇక, టూవీలర్ నడిపే పోలీస్ హెల్మెట్ పెట్టుకున్నా.. వెనుక కూర్చునే అతను మాత్రం హెల్మెట్ పెట్టుకోడు. ఇలా చేయడం తప్పని తెలిసినా.. పోలీసులు అవేమీ పట్టించుకోరు. కట్ చేస్తే….
క్లిక్.. క్లిక్.. క్లిక్..
టెక్నాలజీ వచ్చాక ట్రాఫిక్ రూల్స్‌ను మరీ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. బండి ఆపి.. లైసెన్స్ ఉందా? ఆర్సీ ఉందా? ఇన్సురెన్స్ ఉందా? అని చెక్ చేసే రోజులు కావివి. వాళ్లిప్పుడు అంత కష్టపడాల్సిన పని కూడా లేదు. రూల్స్ బ్రేక్ చేసే వాళ్లకు చలాన్లు వేస్తే సరి.. కోట్లలో ఆదాయం వచ్చేస్తోంది. అందుకే, హెల్మెట్ పెట్టుకోని వాళ్లు, జంక్షన్‌లో సిగ్నల్స్ క్రాస్ చేసే వాళ్లపై మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. అడవుల్లో మాటు వేసి మావోయిస్టులపై కాల్పులు జరిపినట్టుగా.. మన కంటికి కనిపించకుండా జంక్షన్లో ఏదో ఒక మూలన చాటుగా కాపు కాస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోని వాళ్లు కనిపిస్తే.. క్లిక్ క్లిక్ అని ఫోటోలు కొడుతున్నారు. రెడ్ సిగ్నల్ బ్రేక్ చేస్తే.. క్లిక్ క్లిక్. త్రిబుల్ రైడింగ్ వెళ్తుంటే క్లిక్ క్లిక్. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే క్లిక్ క్లిక్. అంతే. ఇంతే సింపుల్. చాలా ఈజీగా పని ఫినిష్ చేసేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. అప్పుడప్పుడు స్పెషల్ చెకింగ్స్ చేపట్టి.. అప్పటి వరకూ వేసిన ఫైన్‌లన్నీ వసూల్ చేస్తుంటారు. కట్టకపోతే బండి సీజ్. ఇక డ్రంకెన్ డ్రైవ్‌ల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే…….
రూ.68 లక్షలు పెండింగ్
ఇంత స్ట్రిక్ట్‌గా ఫైన్లు వేసి.. అంత కఠినంగా పైసా వసూల్ చేసే పోలీసులు.. వాళ్లు మాత్రం చలాన్లు కట్టకుండా ఎగ్గొడుతున్నారట. మన దగ్గర రూల్స్ అదీఇదీ అంటూ నీతులు చెప్పే ఖాకీలు.. వాళ్లలో కొందరు మాత్రం భారీగా చలాన్ డబ్బులు బాకీ ఉన్నారట. ఈ విషయం ఎవరో చెబుతున్నది కాదు. సర్కారే ఆ మేటర్ బయటపెట్టింది. పోలీస్ వాహనాల పెండింగ్ చలాన్లు ఎన్ని ఉన్నాయో చెప్పాలంటూ లోకేంద్రసింగ్ అనే అతను ఆర్‌టీఐ తో ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా.. పోలీస్ వాహనాలపై 17,391 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని బదులిచ్చింది డిపార్ట్‌మెంట్. అలా రూ. 68.67 లక్షల పెండింగ్ చలానా డబ్బులు చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. పోలీసులే ఇంత పెద్ద మొత్తంలో ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతూ.. సామాన్యల నుంచి మాత్రం ముక్కుపిండి మరీ ఫైన్లు వసూల్ చేస్తుండటం దారుణం అంటున్నారు. ఇటీవల గవర్నమెంట్ 90 శాతం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా.. పోలీసులు తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు కట్టలేదన్నట్టేగా? మేమే పోలీసులం.. మనల్ని ఎవడ్రా ఆపేది? అనుకుంటున్నారేమో.