Gachibowli Road Accident : గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10వ తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఊహించని తీరుగా చోటుచేసుకున్న ఈ ప్రమాదం.. ఒక కుటుంబానికి తీరని లోటుగా మారింది. ఎంతో ఉత్సాహంగా రెండో రోజు పరీక్షలు రాసి వస్తున్న ఓ 10వ తరగతి విద్యార్థిని ఈ రోడ్డు ప్రమాదంలో.. బస్సు చక్రాల కింద నలిగి మృతి చెందింది.
ప్రభాతి ఛత్రియ అనే విద్యార్థి రెండో రోజు పరీక్షలు రాసిన అనంతరం ఇంటిని బయలుదేరింది. పరీక్షా కేంద్రం నుంచి ఆమె అన్నయ.. ఆమెను బైక్ ఎక్కించుకుని ఇంటికి తీసుకువెళుతున్నాడు. ఈ పరీక్షలే.. ఆమె జీవితంలోని చివరి పరీక్షలుగా మిగిలిపోయాయి.
ఇన్నాళ్లుగా కష్టపడి చదివి, పరీక్షలు రాసి వస్తూ.. ప్రమాదానికి గురైంది. తన అన్నయ్యతో కలిసి బైక్ మీద ఇంటికి వెలుతుండగా.. బస్సు రూపంలో మృత్యువు ఆమెను పలకరించింది. రోజూలానే ఉదయాన్ని.. మళ్లీ కలుస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వచ్చిన ఈ విద్యార్థిని.. ఆ ప్రయాణమే హృదయ విదారకంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.. పదవ తరగతి విద్యార్థిని మృతి
టెన్త్ ఎగ్జామ్స్ రాసి వస్తుండగా ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కింద పడ్డ ద్విచక్ర వాహనం
స్పాట్ లో విద్యార్థిని ప్రభాతి ఛత్రియ మృతి
ఛత్రియ అన్నయ్యకు గాయాలు pic.twitter.com/TviUu3FmzQ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2025
పరీక్షా కేంద్రం నుంచి తన అన్న బైక్ మీద తిరిగి ఇంటికి వెళుతుండగా… గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చే వరకు డబుల్ డెక్కర్ బస్సు.. వీరి బైక్ ను ఢీకొట్టింది. దాంతో.. బైక అదుపు తప్పి కిందపడిపోగా.. వాళ్లు తేరుకునే లోపుగానే.. డబుల్ డెక్కర్ బస్సు చక్రాలు ఆ యువతి పై నుంచి వెళ్లాయి. ఊహించని ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనతో యువతి స్పాట్ లోనే చనిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది.. విద్యార్థిని స్పాట్ లోనే మృత చెందినట్లుగా ధృవీకరించారు. ఆమె మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అలాగే.. ప్రమాదంలో విద్యార్థిని అన్నయ్యను చికిత్స కోసం తరలించారు.
Also Read : Meerut Murder Case: తాంత్రిక పూజలు చేసి మరీ భర్తను బలి ఇచ్చిందా? నేవీ ఆఫీసర్ ఘటనలో మరో ట్విస్ట్!
కుమార్తె చదువులో మంచి స్థాయికి వెళుతుందని ఆశలు పెట్టుకున్న ఆమె తల్లిదండ్రులు.. అనుకోని ఈ దుర్ఘటనతో తీవ్రంగా విలపిస్తున్నారు. ఆమె అకాల మరణం గురించి తెలుసుకుని.. ఘటనా స్థలంలోనే గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఈ దృష్యాలు అక్కడి వారిని కన్నీరు పెట్టిస్తున్నాయి.