Merchant Navy Officer Murder: ఉత్తర ప్రదేశ్ మీరట్ లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ ఫుత్ హత్య కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడుతున్నాయి. అతడిని కిరాతకంగా చంపిన తర్వాత నిందితులు ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా వ్యవహరించిన తీరు షాక్ కి గురి చేస్తోంది. హత్య తర్వాత సౌరబ్ మృతదేహాన్ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి సాహిల్ ఏకంగా 15 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను కవర్ లో పెట్టి, నిర్మానుష్య ప్రాంతంలో పడేయాలనుకున్నారు. మొండేన్ని బెడ్ బాక్స్ లోనే ఉంచారు. మిగిలిన ముక్కలను సాహిల్ తన గదికి తీసుకెళ్లాడు. ముస్కాన్ ఆ రాత్రంతా ఆ మంచం మీదే పడుకుంది. ఆ తర్వాత సాహిల్ మార్కెట్ కు వెళ్లి ఓ ప్లాస్టిక్ డ్రమ్ము, సిమెంట్ తెచ్చాడు. సౌరబ్ మృతదేహాన్ని ఆ డ్రమ్ములో వేసి సిమెంట్ తో నింపారు. దాని మీద చెత్తా చెదారం వేశారు.
సౌరభ్ తలతో క్షుద్రపూజలు
ఇక పోలీసు విచారణలో భాగంగా సాహిల్ గదికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ దృశ్యాలు కనిపించాయి. ఆయన గది నిండా వింతైన పెయింటింగ్స్ , డ్రాగన్ బొమ్మలు, వింత వింత ఆకారాల్లోని చిహ్నాలు దొరికాయి. ఓ పిల్లి కూడా కనిపించింది. గది అంతా మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో అతడు క్షుద్రపూలు కూడా చేసే వాడని అనుమానిస్తున్నారు. అంతేకాదు, సౌరభ్ హత్య తర్వాత అతడి తల సహా ఇతర శరీర భాగాలన తన గదికి తీసుకొచ్చి క్షుద్రపూజలు చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఆ తర్వాతే ఇద్దరూ కలిసి శరీర భాగాలు డ్రమ్ములో వేసి కాంక్రీట్ పోసినట్లు అనుమానిస్తున్నారు.
సౌరభ్ హత్య తర్వాత హోలీ వేడుకలు
భర్త సౌరభ్ ను హత్య చేసిన తర్వాత ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రేమికుడు సాహిల్ శుక్లాతో కలిసి మీరట్ లో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమె పుట్టిన రోజు వేడుకలను కూడా జరపుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి 12 రోజుల పాటు సిమ్లా టూర్ కు వెళ్లి ఎంజాయ్ చేశారు.
ప్రేమ వివాహం చేసుకున్న సౌరభ్, ముస్కాన్
సౌరభ్ రాజ్ పుత్(29), ముస్కాన్(27) 2016లో లవ్ మ్యారేజీ చేసుకున్నారు. అప్పట్లో ఆయన మర్చంట్ నేవీలో పని చేసేవాడు. కొద్ది కాలానికి వీరికి ఓ పాప పుట్టింది. ఆ తర్వాత తన క్లాస్ మేట్ సాహిల్(25)తో ముస్కాన్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సౌరభ్ కు తెలియడంతో విషయం విడాకుల వరకు వెళ్లింది. కానీ, తన కూతురు కోసం, కుటుంబ సభ్యుల ఒత్తడితో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత లండన్ కు వెళ్లి అక్కడ జాబ్ చేస్తున్నాడు. గత నెల తన కూతురు పుట్టిన రోజు కావడంతో ఇండియాకు వచ్చాడు. ఇది నచ్చిన ముస్కాన్, తన ప్రియుడు సాహిల్ తో కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణం అని పోలీసులు వెల్లడించారు.
Read Also: ప్రియుడితో కలిసి భర్తను లేపేసి.. పట్టపగలే డెడ్ బాడీని బైక్ మీద తీసుకెళ్తూ.. వీడియో వైరల్!