Hyderabad: హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న జలవిహార్‌లో ఘోర ప్రమాం చోటుచేసుకుంది. ఆర్వో ప్లాంట్‌లో పేలుడు సంభవించి అక్కడ పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అప్రత్తమైన తోటి సిబ్బంది, క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. పేలుడు ధాటికి ప్లాంట్‌లోని పరికరాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అసలు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. జలవిహార్‌లో సందర్శకులు ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:అందాల ఆరబోతతో లక్షల్లో సంపాదన.. సబ్‌స్క్రిప్షన్ల పేరుతో నిలువు దోపిడి!