E-Paper
Advertisement

హైదరాబాద్ టూ విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ టూ విశాఖపట్నం ప్రయాణికులకు గుడ్ న్యూస్..?
Advertisement

Greenfield Highway: స్వేచ్ఛ బ్యూరో: ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న (ఎన్.హెచ్.365 – బీ.జీ) గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఖమ్మం-దేవరపల్లి మధ్య సుమారు 162 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు రూ-4,609 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే ప్రధాని మోదీ చేతుల మీదుగా మే నెలలో ప్రారంభించేందుకు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఖమ్మం వద్ద భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం మార్చి ఆఖరుకు పూర్తి అవుతుంది. ట్రయల్ రన్ తరువాత మే నెలలో ప్రధాని మోదీ ప్రారంభిస్తారని నేషనల్ హైవే అధికారులు తెలిపారు. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. పచ్చని పొలాల మధ్యగా సాగే ఈ రహదారి ఇతర హైవేల కంటే ప్రత్యేకం. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్లే ప్రయాణంలో విజయవాడ మార్గంలోకి ఎంటరవ్వకుండా దూరం, సమయం రెండూ గణనీయంగా తగ్గనున్నాయి.

ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే ప్రత్యేకతలు

ఖమ్మం-దేవరపల్లి మధ్య సుమారు 162 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు ₹4,609 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. తెలంగాణ – ఆంధ్ర ప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తొలి ఫోర్ లైన్ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే (ఎన్.హెచ్.365 బీ.జీ)పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో సాగిపోయే ప్రయాణం. ఇందుకు గాను 10 పెద్ద వంతెనలు, 49 చిన్న వంతెనలు, 98 అండర్‌ పాస్‌లు ఏర్పాటు చేశారు.

Advertisement

Also read: ఆ పథకానికి ప్రభుత్వం స్వాహా.. 62 వేల చీరలను వెనక్కి పంపిన సర్కార్!

సకల భద్రతా ఏర్పాట్లు

సౌర విద్యుత్ దీపాలు, ప్రతి రెండు కిలో మీటర్లకు సీసీ కెమెరాలు ఏదైనా ప్రమాదం జరిగితే ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చేలా సాంకేతిక ఏర్పాట్లు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో రెండు వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ప్రతి ఐదు కిలోమీ టర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్. సీసీ కెమెరాలు మానిటర్‌కు కల్లూరు వద్ద కమాండ్ సెంటర్ ఎర్పాటు చేశారు.

దూరం.. సమయం ఆదా

Advertisement

ఇక హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్లే ప్రయాణంలో విజయవాడ మార్గం అవసరం లేకుండా దూరం మరియు సమయం రెండూ గణనీయంగా తగ్గనున్నాయి. మొత్తం100 కి.మీ.దూరం తగ్గనుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలు విజయవాడ వెళ్లకుండా ఖమ్మం దేవరపల్లి నేషనల్ హైవే మీద ప్రయాణం చేయడం ద్వారా సుమారు2 గంటల సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది.

సత్తుపల్లి సుభాష్(రింగ్)సెంటర్ నుండి హైవే పైకీ..

ఖమ్మం నుండి దేవరపల్లి హైవే ఓపెన్ అయింది. సత్తుపల్లి సుభాష్ (రింగ్)సెంటర్‌లో గ్రీన్ ఫీల్డ్ హైవేకి తలుపులు తెరిచారు. త్వరలో హైవే పై ప్రయాణం చేసే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి మరీ శుభాకాంక్షలు తెలిపారు.

Also read: ఇదేం విచిత్రం.. లంచాల స్టేషన్‌కు నెంబర్-1 ర్యాంకా..?

అభివృద్ధికి, ప్రగతికి బాటలు వేసేది రహదారులే: మంత్రి తుమ్మల

జాతీయ రహదారుల నిర్మాణంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి బాటలు వేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఖమ్మం- దేవరపల్లి నేషనల్ హైవే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అభివృద్ధి హారంగా మారుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పట్టిందన్నారు త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతున్న ఖమ్మం- దేవరపల్లి నేషనల్ హైవే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అభివృద్ధి హారంగా మారుతుంది. జాతీయ రహదారుల నిర్మాణాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పట్టిందన్నారు. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ పరంగా విలువ ఆధారిత పంట ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు, ఉద్యాన పంటలు రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు.

రహదారులు ప్రగతి బాటలు

జాతీయ రహదారుల వల్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు విద్యా వైద్యం మార్కెటింగ్ రిటైల్ రంగంలో అనేక మార్పులు సాధ్యమౌతాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లా దేశ వ్యాప్తంగా అనుసంధానమై ప్రగతి బాటలో నిలుస్తుందని మానవ అభివృద్ధికి రహదారులు ప్రగతి బాటలు వేస్తాయన్నారు. వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ పరంగా విలువ ఆధారిత పంట ఉత్పత్తుల ఎగుమతులు దిగుమతులు, ఉద్యాన పంటలు రైతాంగానికి మేలు జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల వల్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు విద్యా వైద్యం మార్కెటింగ్ రిటైల్ రంగంలో అనేక మార్పులు సాధ్యమౌతాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లా దేశ వ్యాప్తంగా అనుసంధానమై ప్రగతి బాటలో నిలుస్తుందని మానవ అభివృద్ధికి రహదారులు ప్రగతి బాటలు వేస్తాయన్నారు. దాదాపు ప్రతీ నియోజకవర్గానికి ఒక జాతీయ రహదారి ఏర్పాటయ్యే విధంగా చర్యలు తీసుకుని మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేసుకున్నారు.

కేంద్ర మంత్రి గడ్కరీతో..

రహదారులే అభివృద్ధికి బాటలు వేస్తాయనీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి సౌకర్యంతోనే గ్రామాలు అబివృద్ధి బాట పట్టి ప్రభుత్వ అబివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతాయని బలంగా నమ్ముతానని, అందుకే రహదారుల అభివృద్ధి కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పట్టుబట్టి సాధించామన్నారు. జాతీయ రహదారుల ఏర్పాటులో భాగంగా పలుమార్లు కేంద్ర మంత్రి గడ్కరీతో సంప్రదింపులు జరిపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జాతీయ రహదారుల ఏర్పాటు కోసం అన్ని శాఖల వారిని సమన్వయం చేసుకుంటూ నిత్యం నేషనల్ హైవే అధికారులతో మానిటర్ చేస్తూ ఈ జాతీయ రహదారి నిర్మాణపనులు తుది దశకు చేరడంలోదోహదమయ్యారు.

Also Read: ఇన్నాళ్లకు మేలుకొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

Related News

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

GHMC ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.. నోటిఫికేషన్‌కు తాత్కాలిక బ్రేక్!

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టులపై కీలక ప్రకటన.. వరంగల్ ఎయిర్‌పోర్టు నిధులు, టెండర్లు ఆహ్వానంపై

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Big Stories

Advertisement
×