E-Paper
Advertisement

హైదరాబాద్ సిటీ బీజేపీలో విషాదం..బడంగ్‌పేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య, ఏం జరిగింది?

హైదరాబాద్ సిటీ బీజేపీలో విషాదం..బడంగ్‌పేట్  అధ్యక్షుడు  రామకృష్ణారెడ్డి ఆత్మహత్య, ఏం జరిగింది?
Advertisement

Hyderabad:  హైదరాబాద్ సిటీ బీజేపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బడంగ్‌పేట్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియగానే సిటీ పార్టీ నేతలు షాకయ్యారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఆయన ఆత్మహత్య వెనుక కారణమేంటని ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్ సిటీ బీజేపీలో తీవ్ర విషాదం

Advertisement

హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్‌లో బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఏం జరిగిందో తెలీదు. రామకృష్ణారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిత్యం ప్రజాసమస్యలపై పోరాడే వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.

బడంగ్పేట్ పరిధిలో జరిగిన అవినీతిపై ఆయన తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. ఇటీవల రూ.150 కోట్ల స్కామ్‌ని ఆయన వెలుగులోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వ్యవహారం జరుగుతుండగా ఆయన మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. రామకృష్ణ మృతి విషయం తెలియగానే పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు.

Advertisement

బడంగ్‌పేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆత్మహత్య.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఇరుగుపొరుగు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు కుటుంబ కలహాలు రామకృష్ణారెడ్డి మృతికి కారణమై ఉండవచ్చని మీర్‌పేట్‌ పోలీసులు అనుమానిస్తున్నారు.  పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.  మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×