E-Paper
Advertisement

Hyderabad: క్యాబ్ ప్రయాణించే యువతికి పెళ్లి ప్రపోజ్.. రూట్ మార్చే ప్రయత్నం.. చివరకు..?

Hyderabad: క్యాబ్ ప్రయాణించే యువతికి పెళ్లి ప్రపోజ్.. రూట్ మార్చే ప్రయత్నం.. చివరకు..?
Advertisement

Hyderabad: క్యాబ్‌లలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత హైదరాబాద్‌లో మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుక నుంచి తిరిగి వస్తున్న ఒక యువతికి క్యాబ్ డ్రైవర్ నుంచి అత్యంత భయానక అనుభవం ఎదురైంది. క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కిన ఆమెను డ్రైవర్ కిడ్నాప్ తరహాలో బెదిరించాడు. ఈ సంఘటన క్యాబ్ ప్రయాణాలు ఎంత ప్రమాదకరంగా మారాయో ప్రూఫ్ చేసింది. డ్రైవర్ల చేతిలో మహిళలు ఎంత అభద్రతగా ఉంటున్నారో ఈ ఘటన కళ్లకు కట్టినట్టు చూపించింది.

దారి మళ్లించి పెళ్లి వేధింపులు

బంజారా హిల్స్ రోడ్ నంబర్ రెండులో యువతి క్యాబ్ ఎక్కింది. షైక్ ముజ్జహీద్ అనే డ్రైవర్ ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్లే బదులు దారి మళ్లించాడు. బర్మా నుంచి వచ్చి ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో ఉంటున్న ఈ డ్రైవర్… యువతిని మాటల్లోకి దింపి ఆమె మతం, రూపం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. ముస్లిమ్ అని తెలుసుకుని.. ‘మీరు చాలా అందంగా ఉన్నారు మేడం’ అంటూ అతిగా పొగిడాడు. అంతలోనే షార్ట్‌కట్ పేరు చెప్పి టోలిచౌకీ వైపు కారును తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాక అసలు రంగు బయటపెట్టాడు.

మీడియా ఫ్రెండ్ కు లైవ్ లొకేషన్

Advertisement

‘మేడమ్ నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఇష్టమైతేనే లేదంటే లేదు కానీ నాకు మాత్రం చాలా ఇష్టం’ అంటూ బెదిరించాడు. ‘ఇది నా ప్రాంతం. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్లలేవు’ అంటూ ఆమెను బంధించినట్టు మాట్లాడాడు. ఇది సాధారణ వేధింపు కాదని, ఏదో పెద్ద నేరానికి పాల్పడే దుర్మార్గ ప్రయత్నమేనని స్పష్టమవుతోంది. డ్రైవర్ తీరుతో భయపడిన ఆ మహిళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెలివిగా వ్యవహరించింది. వెంటనే తన లైవ్ లొకేషన్‌ను స్నేహితులకు పంపింది. వారిలో ఒకరు ప్రముఖ వార్తా ఛానెల్‌లో పని చేస్తుండటంతో ఆమె ద్వారా సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరింది. పోలీసులు వెంటనే వాహనాన్ని ట్రాక్ చేసి మార్గాన్ని అనుసరించి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. సకాలంలో పోలీసులు రావడంతో మహిళ సురక్షితంగా బయటపడింది.

Also Read: Sathya Sai Crime : శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. నాలుగేళ్ల బాలుడిని హత్య చేసిన మేనత్త భర్త

Advertisement

నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. యువతి సాహసం వల్లే పెను ప్రమాదం తప్పింది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ సకాలంలో సాయం అందడం అసాధ్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళల భద్రతకు సంబంధించి క్యాబ్ సంస్థలు, పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×