E-Paper
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిపై అత్యాచారం.. నిందితుడు ఆ నేత వద్ద కారు డ్రైవర్

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం.. చిన్నారిపై అత్యాచారం.. నిందితుడు ఆ నేత వద్ద కారు డ్రైవర్
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. నిందితుడు బీఆర్ఎస్‌కి చెందిన ఓ నేత వద్ద కారు డ్రైవర్. ఎట్టకేలకు నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, చర్లపల్లి జైలుకి తరలించారు.

హైదరాబాద్‌లోని బౌరంపేట బస్తీ. బీఆర్ఎస్ కౌన్సెలర్ వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు యోగి అనే వ్యక్తి. అయితే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజులుగా ఈ తతంగం నడుస్తోంది. ఆమెకి నాలుగేళ్లు చిన్నారి ఉంది.

Advertisement

ఈ కామాంధుడు దృష్టి చిన్నారిపై పడింది. ఈ క్రమంలో చిన్నారి తల్లితో ఏకాతంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు చిత్రీకరించాడు. వాటిని అడ్డం పెట్టుకుని మహిళను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరువు పోతుందని భావించింది ఆమె.

కారు డ్రైవర్ యోగి, ఎవరూ లేని ప్రాంతానికి చిన్నారిని తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు తల్లిదండ్రులు. చివరకు ఓ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉండడం గమనించారు. వెంటనే బాలికను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ALSO READ: కడప జిల్లా, లోయలో పడిన ఆర్టీసీ బస్సు, 30 మందికి గాయాలు.. తప్పెవరిది?

చిన్నారిని అత్యాచారం జరిగిందని చెప్పడంతో పేరెంట్స్ ఖంగుతిన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత తల్లిదండ్రులు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడు యోగిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అరెస్టు చేసి చర్లపల్లి జైలుకి తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×