Mahabubabad Crime: మనుషులు పశువుల కన్నా హీనంగా మారుతున్నారు. తల్లి, చెల్లి, కూతురు అనే వరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు. కన్నుమిన్ను ఎరగకుండా కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ నీచుడు తల్లితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుని, కూతురు వరుస అయ్యే మైనర్ అయ్యాయిని ప్రెగ్నెంట్ చేశాడు. ఆ తర్వాత బాలికకు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అబార్షన్ చేయించాడు. ఈ విషయం చైల్ వెల్ఫేర్ అధికారులకు తెలియడంతో అసలు కథ బయటకు వచ్చింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేథ్యంలో సదరు మహిళ తన భర్త దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మహబూబాబాద్ నుంచి పెట్టే బేడా సర్ధుకుని తన కూతురిని వెంటబెట్టుకుని.. యాదాద్రి భువనగిరి జిల్లా ఘట్కేసర్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడే ఓ కిరాయి ఇల్లు తీసుకుంది. అందులో నివాసం ఉంటూ చిన్నా చితకా పనులు చేస్తూ జీవిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు మరిది వరుసయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది. తల్లిని వలలో వేసుకున్న మాయగాడు, ఆమె కూతురు మీద కూడా కన్నేశాడు. వరుసకు బిడ్డ అవుతుందని తెలిసినా, ఉచ్ఛ నీచాలు మరిచాడు. ఆమె కూతురితోనూ గడపాలనుంది చెప్పాడు. ఏ తల్లి అయినా ఆ మాట వినగానే చెంప చెల్లుమనిపిస్తుంది. కానీ, ఈ మహాతల్లి సరే అని ఒప్పుకుంది. అంతేకాదు, బాబాయ్ తో గడపాలని బలవంతం కూడా చేసింది. వద్దని వారించాల్సిన తల్లే బలవంతం చేయడంతో ఆ అమ్మాయికి ఏం చేయాలో? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ దుర్మార్గుడు ఆమె మీద పలు మార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు ఆ అమ్మాయి గర్భం దాల్చింది.
తొర్రూరు హాస్పిటల్ లో అబార్షన్
తనలో తాను కుమిలిపోయిన ఆ అమ్మాయి చివరకు ఈ విషయాన్ని తన అమ్మమ్మకు చేరవేసింది. తను ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని కూడా చెప్పింది. వెంటనే, ఆ అమ్మాయి అమ్మమ్మ గుట్టు చప్పుడు కాకుండా తొర్రూరుకు తీసుకెళ్లింది. అమ్మ ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లకు అసలు విషయం చెప్పి బాలికకు అబార్షన్ చేయించింది. అక్కడి వరకు బాగానే ఉన్నా, అసలు కథ అప్పుడే మొదలయ్యింది.
తల్లితో వివాహేతర సంబంధం.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అమ్మ ఆసుపత్రిలో బాలికకు అబార్షన్
భర్తతో విభేదాల వల్ల ఘట్కేసర్ లో కుమార్తెతో కలిసి నివాసముంటున్న మహిళ
మరిది వరుస అయ్యే రాముతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ
తల్లిని వలలో వేసుకుని మైనర్… pic.twitter.com/kdXdwC8T2N
— BIG TV Breaking News (@bigtvtelugu) March 22, 2025
Read Also: ప్రియుడితో కలిసి భర్తను లేపేసి.. పట్టపగలే డెడ్ బాడీని బైక్ మీద తీసుకెళ్తూ.. వీడియో వైరల్!
చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు విషయం తెలియడంతో..
అమ్మ హాస్పిటల్ లో మైనర్ బాలికకు అబార్షన్ చేశారనే విషయం చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు తెలిసింది. వెంటనే ఈ ఘటనపై విచారణ మొదలు పెట్టారు. డాక్టర్లను ప్రశ్నించడంతో ఒక్కొక్కటిగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయి తల్లి, ఆమె ప్రియుడి దారుణాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో అబార్షన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై, బాలికపై అత్యాచారానికి పాల్పడిన రాముపై, అందుకు సహకరించిన బాలిక తల్లిపై అత్యాచార నిరోధక చట్టం, పోక్సో కేసులు నమోదయ్యాయి. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
Read Also: తాంత్రిక పూజలు చేసి మరీ భర్తను బలి ఇచ్చిందా? నేవీ ఆఫీసర్ ఘటనలో మరో ట్విస్ట్!