E-Paper
Advertisement

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా ర‌మ‌ణి (26) అనే యువ‌తి కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్పడింది. ఆమె మాదాపూర్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్‌గా ప‌ని చేస్తోంది. రోజా రమణి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆమె దుర్గంచెరువులోకి దూకిన దృశ్యాలు బయటపడ్డాయి.

అయితే, ఈ ఘోర నిర్ణయానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బలంగా అనుమానిస్తున్నారు. అప్పుల వసూళ్ల పేరుతో ఏజెంట్లు పెట్టిన మానసిక క్షోభే యువతి ప్రాణం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఒక యువతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.

Advertisement

Also Read: ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×