E-Paper
Advertisement

Road Accident: యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

Road Accident: యువకుడి పైనుంచి వెళ్లిన ట్రావెల్ బస్సు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
Advertisement

Road Accident: నేడు వార్త పత్రిక తిరగేసినా.. టీవీ ఛానెల్ పెట్టినా ఎక్కడో ఒకచోట జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఒక మరణవార్త మరిచిపోకముందే మరో వార్త వినాల్సి రావడం అత్యంత దురదృష్టకరం. రోడ్డుపై రక్తం మరక ఆరకముందే.. మరో ప్రాణం గాలిలో కలిసిపోతుంది. అటువంటి ఘటనే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ మెహిదీపట్నంలో ఘరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టోలిచౌకి నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై.. జెప్టో సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల అభిషేక్ తన టూవీలర్‌పై విధుల్లో బాగంగా వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడు వాహన నియంత్రణ కోల్పోయి రోడ్డుపై కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుండి వేగంగా వస్తున్న గణేష్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు.. అభిషేక్‌పై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిని ప్రాంతంలో ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి.. వాహనాలను మళ్లించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అభిషేక్ మృతి చెందిన సమాచారం తెలియగానే అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. యవ వయసులో కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కుమారుడు ఇలా ప్రాణాలు కోల్పోవడం వారి గుండెలను పిండేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×