Daaku Maharaj : బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమా డాకు మహారాజు. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ కు వెళ్ళిపోయాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా గ్లిమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. ఇక రీసెంట్ గా బాబి పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ప్రతి ఇంటర్వ్యూలో బాబి మాట్లాడుతుంటే తన నమ్మకం కనిపిస్తుంది అని చెప్పాలి.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ సినిమాను నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక నాగ వంశీ కూడా ఈ సినిమా గురించి విపరీతమైన ఎలివేషన్ ఇస్తున్నాడు. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో నాగవంశీ నుంచి మాట్లాడుతూ ఈ సినిమా బాలకృష్ణ గత మూడు సినిమాలు కంటే అద్భుతంగా ఉంటుందని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. బాలకృష్ణ వరుసుగా మూడు హిట్ సినిమాలు చేశారు. ఆ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. వాటిని మించి ఈ సినిమా ఉండబోతుంది అంటేనే ఫ్యాన్స్ కి క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక తాజాగా ట్విట్టర్ స్పేస్ లో ఈ సినిమా గురించి ఇంకా హైప్ క్రియేట్ చేశాడు నాగ వంశీ. నాగ వంశీ మాట్లాడుతూ థియేటర్ స్టార్ట్ అవ్వటానికి 20 నిమిషాల ముందు నుంచే కంటిన్యూస్ గా పేపర్లు ఎగురుతూ ఉంటాయి. నిల్చోని పేపర్లు విసురుతోనే ఉంటారు, ఇంటర్వెల్ కి థియేటర్లు తగలబడి పోతాయి అంటూ వంశీ తెలిపాడు.
Also Read : Game Changer: సుకుమార్ హైప్ పెంచారు కానీ.. ఇన్సైడ్ టాక్ ఏంటంటే..?
అంతేకాకుండా అమెరికాలో జరగబోతున్న ఈ సినిమా ఈవెంట్స్ గురించి ప్రత్యేకించి కేర్ తీసుకోమని యూఎస్ అభిమానులకు తెలిపాడు. ఒక ఈవెంట్ జరిగే చోటు కేవలం 100 మందికి పడితే బయట 200 మందికి సరిపడా ఖాళీ ప్లేస్ ఉండాలి అంటూ తెలిపాడు నాగ వంశీ. నాగ వంశీ వ్యాఖ్యలను బట్టి రీసెంట్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక అనుకోని సంఘటన ఎంతలా ఇండస్ట్రీని కదిపేసింది అని అర్థమవుతుంది. కేవలం ఇండస్ట్రీకి మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి అయితే అది తీరని లోటు అని చెప్పాలి. ఇకపోతే యూఎస్ లో జరిగిన ఈవెంట్ రేంజ్ ను బట్టి తను ఆంధ్రాలో కూడా ఆ ఈవెంట్ రేంజ్ ను కంటిన్యూ చేస్తాను అంటూ ఆ స్పేస్ లో చెప్పుకొచ్చాడు వంశీ.
Also Read : Jabardasth Sowmya Rao: ఈ ఇండస్ట్రీని నమ్ముకుంటే అంతే.. హాట్ యాంకర్ సంచలన వ్యాఖ్యలు