Mega Heros: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఒక గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఒక్క ఈ కుటుంబం నుంచే దాదాపు పది మందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. అందులో కొంతమంది పాన్ ఇండియా హీరోలుగా రికార్డు సృష్టిస్తే, ఇంకొంతమంది గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇంకొంతమంది ఆ సక్సెస్ కోసం పరితపిస్తున్నారు.ఇకపోతే ఇంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరోలు ఇండస్ట్రీలో ఏం చేసినా సరే అది సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ మెగా హీరోలు.. ఏకంగా ముగ్గురు డైరెక్టర్లపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ డైరెక్టర్లు ఎవరు? మెగా హీరోలు ఇంత కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.
‘గేమ్ ఛేంజర్’ కారణంగా మళ్లీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న రామ్ చరణ్..
అసలు విషయంలోకి వెళ్తే.. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan). కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో చేసిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కోట్లు రాబడుతోందని మేకర్స్ పోస్టర్స్ రివీల్ చేస్తున్నారు కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియడం లేదు. మొత్తానికైతే అటు కథ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో రామ్ చరణ్ మరోసారి ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఈ విషయం తెలిసి రామ్ చరణ్ అభిమానులు కూడా బాగా హర్ట్ అవుతున్నారు. ఇకపోతే ఇప్పుడు మెగా హీరో చరణ్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు మెగా కాంపౌండ్ నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ ముగ్గురు డైరెక్టర్ లను బ్యాన్ చేసిన మెగా ఫ్యామిలీ..
గతంలో రెండు సార్లు ఇద్దరు డైరెక్టర్ల వల్ల సోషల్ మీడియాలో రామ్ చరణ్ ట్రోలింగ్ కి గురయ్యారు. అందుకే ఇప్పుడు ఆ డైరెక్టర్లని బ్యాన్ చేసి పడేసాడు. ఇప్పుడు శంకర్ ను కూడా అదే విధంగా బ్యాన్ చేసి పడేసాడంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భవిష్యత్తులో ఆయనతో సినిమాలు కూడా ఓకే చెయ్యరు అని మెగా అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. 2019లో బోయపాటి శ్రీను (Boyapati Srinu )దర్శకత్వంలో సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా సమయంలో కూడా రామ్ చరణ్ పై ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత బోయపాటితో సినిమా ఊసే ఎత్తలేదు. ఇక కొంతకాలానికి రామ్ చరణ్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేశారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi ) కూడా నటించారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో చాలామంది ఈ మెగా హీరోలకు ఏమైంది? బ్రెయిన్ ఉందా లేదా? అంటూ చాలామంది కామెంట్లు చేశారు. దీంతో మెగా పవర్ స్టార్ అటు బోయపాటి ఇటు కొరటాల శివని కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా శంకర్ కారణంగా మళ్ళీ ఇలాంటి ట్రోలింగ్ జరుగుతుండడంతో శంకర్ ని కూడా మెగా ఫ్యామిలీ బ్యాన్ చేసిందని సమాచారం. మొత్తానికైతే ఈ మెగా హీరోలు ఎవరూ కూడా ఈ ముగ్గురు డైరెక్టర్లతో ఇకపై సినిమా చేయరు అని వార్తలు అనిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.