Hyderabad: తెలంగాణలో సంచలనం రేపుతోంది బెట్టింగ్ యాప్‌ల వ్యవహారం. ఈ కేసులో తీగలాడితే డొంక కదులుతోంది. ఇప్పటికే నోటీసులు అందుకున్న సినీ స్టార్స్, బుల్లితెర నటీనటులు, యూట్యూబర్స్ విచారణకు హాజరవుతున్నారు. మరికొందరు సమయం కోరుతున్నారు. కొందరు ఓపెన్‌గా వివరణ ఇస్తున్నారు. జరుగుతున్న పరిణామాలను పోలీసులు గమనిస్తున్నారు.
కొత్త మలుపు తిరిగిన బెట్టింగ్ యాప్ కేసు
తాజాగా బెట్టింగ్ యాప్స్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెట్టింగ్ వ్యవహారంపై ఇప్పటివరకు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సేకరించే పనిలోపడ్డారు పోలీసులు. గతేడాదిలో బెట్టింగ్ యాప్‌ల వల్ల దాదాపు 15 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వాటికి సంబంధించి 15 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ కేసులను బయటకు తీస్తున్నారు. బెట్టింగ్ యాప్ ద్వారా వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వాటి నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు.
బెట్టింగ్ యాప్ బాధితులపై దృష్టి
బెట్టింగుల యాప్‌ల అంశం తెలంగాణలో హట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీటి ద్వారా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య అనధికారికంగా దాదాపు 1000 మందికి పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. వీటిపై నమోదు అయిన కేసు ఇప్పటివరకు 15 మంది మాత్రమే. చాలామంది ఫిర్యాదు చేయలేదు.
ALSO READ: బిజినెస్‌మేన్ ఫ్యామిలీలో ఏం జరిగింది?
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్ పెద్దగా ఫోన్ యూజర్స్ పెద్దగా తెలీదు. సెలబ్రెటీలు ప్రమోట్ చేయడంతో వాటి గురించి యువకులకు తెలిసింది. ఆ మత్తులో పడి డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్నదంతా పొగొట్టుకున్నారు. ఆపై ఆత్మహత్యలకు పాల్పడ్డారు కూడా. ఈ క్రమంలో ప్రమోషన్లు చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారు.
బెట్టింగ్ యాప్స్‌పై తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉంది. కానీ డబ్బుల కోసం కొందరు సెలబ్రెటీలు వీటిని ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్‌తోపాటు వాటిని ప్రమోట్ చేసినవారిపై కొరడా ఝులిపిస్తున్నారు. దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసినట్టు పోలీసుల సమాచారం. వీటిని ఇప్పుడు అడ్డకట్ట వేయకుంటే రాబోయ రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో
ఎందుకంటే మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో బెట్టింగ్‌ల కోసం కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని యువత నాశనం కాకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 22 నుంచి మొదలై ఐపీఎల్, మే థర్డ్ వీక్ వరకు ఉండనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగేశారు.
బాలీవుడ్‌లో అప్పట్లో కలకలం
అన్నట్లు ఆ మధ్య బాలీవుడ్‌లోనూ బెట్టింగ్ యాప్ ల వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ముసుగులో హవాలా మార్గంలో సొమ్ము విదేశాలకు తరలిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన పలువురి పేర్లు వెలుగు చూశాయి. మొత్తానికి తెలంగాణ పోలీసులు ఈ వ్యవహారంపై తీగలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇంకెమంతి పేర్లు బయటపడతాయో చూడాలి.
బెట్టింగ్ యాప్స్ కేసులో మరో కీలక పరిణామం
ఇప్పటివరకు బెట్టింగ్ లో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
గత ఏడాది కాలంలో బెట్టింగ్ ల వల్ల 15 మంది ఆత్మహత్య
తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదు
ఈ కేసులను ఇప్పుడు వెలికి తీస్తున్న పోలీసులు
ఆయా బెట్టింగ్… pic.twitter.com/KufYb1JdSw
— BIG TV Breaking News (@bigtvtelugu) March 21, 2025