BigTV English

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..

Assembly budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం, ఇలాంటి తీర్మానం పెట్టడం..
Advertisement

Assembly budget session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంట లకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సాయన్నకు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశ పెట్టడం బాధగా ఉందన్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులన్నారు. చాలా ఏళ్లగా ఇద్దరు కలిసి పని చేశామని గుర్తుచేశారు. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించారన్నారు.

తండ్రి వారసత్వాన్ని తీసుకుని లాస్య ప్రజాజీవితంలోకి వచ్చారన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజల తరపున పోరాడుతారని భావించామని, దురదృష్టశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని వివరించారు. కంటోన్మెంట్ ప్రజల మనసుల్లో శాశ్వతంగా సాయన్న, లాస్య నిలిచి పోతారన్నారు. వారు చేయాలనుకున్న పనులను ప్రబుత్వం పూర్తి చేస్తుందన్నారు. లాస్య మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేశారు.


ALSO READ: రెండో విడత రైతు రుణమాఫీకి రేవంత్‌ సర్కార్‌ సిద్ధం.. వచ్చేవారమే ఖాతాల్లోకి..

కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంతాపం తెలిపా రు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశా లను బుధవారం నాటికి వాయిదా వేశారు స్పీకర్.

Related News

Jubilee Hills Bypoll: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి బడా నేతలు, జనాలను మెప్పించేది ఎవరో?

Konda Surekha: మా మధ్య గొడవలు లేవు.. సీఎం రేవంత్‌‌కు సురేఖ క్షమాపణలు, ఎండ్ కార్డ్ పడినట్లేనా?

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినేట్ కీల‌క నిర్ణ‌యాలు.. స‌ర్పంచ్ ఎన్నిక‌ల‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

Southwest Airlines: హైదరాబాద్ లో సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్.. సీఎం సమక్షంలో ప్రకటన

Kcr Meeting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ.. 2 గంటలకు పైగా నేతలతో కేసీఆర్ మంతనాలు

Salman Khan: అప్పట్లో 25 కేసులు.. ఇప్పుడు ఏకంగా పార్టీలో చోటు.. రౌడీ షీటర్ సల్మాన్ ఖాన్‌పై కేటీఆర్ ప్రశంసలు

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం.. మల్లారెడ్డి చిలక పలుకులు, అదంతా మాయ

Indiramma Housing Scheme: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఇకపై పట్టణాల్లో కూడా ఆ స్కీమ్

Big Stories

×