BigTV English

People complaint on IAS Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మిత సబర్వాల్, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు

People complaint on IAS Smita Sabharwal: చిక్కుల్లో ఐఏఎస్ స్మిత సబర్వాల్, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు
Advertisement

People complaint on IAS Smita Sabharwal(Telangana news): తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా‌సబర్వాల్ చేసిన కామెంట్స్ ముదిరిపాకాన పడ్డాయి. వికలాంగులను అవమానపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. తాజాగా ఐఏఎస్ స్మితా సబర్వాల్‌పై ఇబ్రహీంపట్నం పోలీసు‌స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది.


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్​లో ఫిర్యాదు నమోదైంది. వికలాంగులను అగౌరవపరిచేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారాయన.

దివ్యాంగులు ఐఏఎస్‌కు పనికిరారని వారికి శారీరకంగా పని చేయలేరని, ఫీల్డ్ విజిట్ చేయలేరని చేసిన కామెంట్స్ ఆమె అహంకారానికి నిదర్శనమన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


ALSO READ: ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం.. ఆ వివరాలివే..

అంతేకాదు తెలంగాణలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై మానవ హక్కుల కమిష నర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ వ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చేసిన కామెంట్స్‌పై చర్చ జరుగుతోంది. కొందరు స్మిత వాదనను ఏకీభవిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ నాయకులు, మాజీ అధికారులు సైతం తమతమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఐఏఎస్ మరో ట్వీట్ చేశారు. రక్షణ రంగాలలో ఈ కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయబడ లేదో కూడా పరిశీలించాలని హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నానని మనసులోని మాట బయటపెట్టారు.

 

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×