E-Paper
Advertisement

భద్రాద్రికొత్తగూడెంలో రేషన్ మాఫియా.. 450 క్వింటాళ్ల బియ్యం సీజ్!

భద్రాద్రికొత్తగూడెంలో రేషన్ మాఫియా.. 450 క్వింటాళ్ల బియ్యం సీజ్!
Advertisement

PDS Rice: స్వేచ్ఛ బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) కింద పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై జిల్లా యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించి 450 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున సుమారు 1.45 గంటల సమయంలో సివిల్ సప్లై అధికారులు, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇల్లెందు మండలం రేపల్లెవాడలోని కోట మైసమ్మ గుడి సమీపంలో అక్రమంగా లారీలో లోడ్ చే స్తున్న 200 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు.

అక్రమంగా..

ఒక లారీ, ఒక బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరో దాడి ఘటనలో టేకులపల్లి మండలంలో సుమారు 250 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలించే ప్రయత్నంలో ఉన్న లారీని అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి మళ్లించేందుకు యత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దారి మళ్లించడం అత్యంత తీవ్రమైన నేరమని, ఇందులో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర తనిఖీలు, దాడులు కొనసాగుతాయని తెలిపారు.

Advertisement

Also Read: నథింగ్ నుంచి మరో సంచలనం.. మెటల్ బాడీ, భారీ బ్యాటరీతో వచ్చేస్తోన్న CMF Phone 3 Pro!

చట్టపరమైన చర్యలు

ఈ రెండు ఘటన లపై విచారణ కొనసాగు తుందని, దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. నిందితులపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (TSPDS) కంట్రోల్ ఆర్డర్ నిబంధనలు, భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసామని అదనపు కలెక్టర్ తెలిపారు. దాడుల్లో జిల్లా పౌరసరఫ రాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై సమాచారం అందించేందుకు ముందుకు రావాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు.

Advertisement

Also read: మేడ్చల్ పెద్ద చెరువుకి కన్నం.. తూములు తెరిచి నీరు వృథా ..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×