IT Manager Gangraped: సభ్య సమాజం తలదించుకునే ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. బర్త్ డే వేడుకల తర్వాత ఇంటికి వెళ్లేందుకు ఓ ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌ని లిఫ్ట్ ఇచ్చారు తోటి కంపెనీ ఉద్యోగులు. వెళ్తున్న కారులో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెనుక కంపెనీ సీఈఓతోపాటు సహా ముగ్గుర్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలేం జరిగింది?
ఉదయ్‌పూర్‌లో దారుణం.. బర్త్ డే పార్టీ ఆ తర్వాత
దారుణమైన ఘటనకు రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ వేదికైంది. డిసెంబర్ 20న ఓ హోటల్‌లో బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఐటీ కంపెనీ సీఈఓ సహా తోటి ఉద్యోగులంతా హాజరయ్యారు. సెలబ్రేషన్స్ తర్వాత రాత్రి ఒంటి గంటన్నర సమయంలో ఐటీ కంపెనీ మహిళా మేనేజర్‌ని ఇంట్లో దింపేందుకు కారులో బయలుదేరారు తోటి ఉద్యోగులు.
మేనేజర్ వెంట ఆ కంపెనీ సీఈవో, మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త ఇంటి వద్ద దింపు తామని నమ్మబలికారు. ధూమపానానికి సంబంధించిన కొన్ని కొనుగోలు చేశారు. తాగిన కొద్దిసేపటికి మహిళా స్పృహ కోల్పోయింది. వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో ఆమెని ఇంటి వద్ద దించారు.
ఐటీ మేనేజర్‌పై గ్యాంగ్‌రేప్, పోలీసుల అదుపులో సీఈవో సహా ముగ్గురు
స్పృహలోకి వచ్చిన తర్వాత శరీరంపై భాగాలపై గాయాలు ఉండటాన్ని గమనించింది బాధితురాలు. ఎవరైనా చెబితే పరువుపోతుందని భావించింది. చివరకు మూడు రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించింది. తన కంపెనీ వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదులో ప్రస్తావించింది. ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఉదయపూర్ ఎస్పీ యోగేష్ గోయల్ తెలిపారు. ఘటన సమయంలో కారులోని డ్యాష్ క్యామ్ ఆడియో, వీడియో రికార్డింగ్‌లు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
ALSO READ: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి