BigTV English

Jagityal: దారుణం.. కన్న బిడ్డను గొడ్డును బాదినట్టు బాదిన కసాయి తల్లి..!

Jagityal: దారుణం.. కన్న బిడ్డను గొడ్డును బాదినట్టు బాదిన కసాయి తల్లి..!

Jagityal: ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది మరొకటి ఉండదు అంటారు. కన్న బిడ్డల కోసం తల్లి ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. చిన్న చిన్న విషయాలపై కూడా ఆమె ప్రేమను వ్యక్తం చేస్తుంటుంది. ఈ ధరిత్రికి ఉన్న ఓర్పు ఈ ప్రపంచంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరకి ఉండదు.. నవ మాసాలు మోసి బిడ్డను కనడం మహిళకు మరో జన్మ అంటారు. పిల్లల ప్రాణం ప్రమాదంలో ఉందంటే.. తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన ప్రాణాలను ఏమాత్రం లెక్క చేయకుండా.. బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటుంది.


సాధారణంగా తల్లిప్రేమ చాలా గొప్పది. బిడ్డ శ్రేయస్సు కోసం కడుపున వున్నది మొదలు, పెంచి పెద్ద చేసేదాకా, ఇంకా చెప్పాలంటే తన కొన ఊపిరి ఉన్నంత వరకు పాటు పడుతూనే వుంటుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో తల్లి ప్రేమకు నిర్వచనమే మారిపోతుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు.. కన్న బిడ్డల పాలిట యమపాశాలుగా మారుతున్నారు. రాను రాను మనుష్యుల్యో క్రూరత్వం ఎక్కువైపోతుంది. జగిత్యాలలో ఓ తల్లి కర్కశత్వం చూస్తే.. ఇంతకీ ఈమె తల్లేనా అన్న అనుమానం రావడంలో అతిశయోక్తి కాదు. అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా కన్నకొడుకును చితకబాదింది ఓ తల్లి.

జగిత్యాలలోని తులసి నగర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది ఈ ఘటన. తులసినగర్‌లో తన చిన్నారి కుమారుడుతో నివాసం ఉంటోంది రమ అనే మహిళ. ఈ మధ్యకాలంలో ఆమె భర్త ఆంజనేయులు దుబాయ్ నుంచి ఇంటికి వచ్చారు. వీరిద్దరి మధ్య ఏదొక కారణంతో తరుచూ గొడవ పడేవారు. రమ తన కొడుకును రోజూ చీటికిమాటికి తీవ్రంగా కొట్టేది.. గొడ్డును బాదినట్టు బాదేది. ఇది గమనించిన చుట్టుప్రక్కల ఉన్నవారు.. రమ కర్కశత్వాన్ని ఓ వీడియో తీసి సఖి సెంటర్ కు ఫిర్యాదు చేశారు.


సమాచారం తెలుసుకున్న డీసీపీవో హరీశ్‌‌ రమ, ఆంజనేయులుకు కౌన్సిలింగ్‌‌ ఇచ్చి, బాలుడిని అమ్మమ్మ, తాతయ్యకు అప్పగించారు. రమ కుటుంబం పలు రకాల సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read: ఒక్కో కత్తి పోటుకు రూ. 2 లక్షలు.. వీరయ్య హత్య కేసులో సంచలన నిజాలు

పిల్లల జీవితానికి తల్లి, దండ్రులు అండగా నిలవాలి. కానీ కొన్ని సందర్భాల్లో మానసిక సమస్యలు, ఒత్తిడులు, సమాజపు మరుగున పడ్డ పరిస్థితులు.. తల్లిని దారుణ నిర్ణయాలకు తీసుకెళ్తాయి. ఇది  చిన్నారుల జీవితాన్ని శాశ్వతంగా దెబ్బతీస్తుందని డీసీపీవో అన్నారు.

 

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×