BigTV English

Kingdom first single : ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చినా కూడా పెద్దగా హడావిడి లేదు, నాగ వంశీ ప్రెస్ మీట్ కారణమా.?

Kingdom first single : ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చినా కూడా పెద్దగా హడావిడి లేదు, నాగ వంశీ ప్రెస్ మీట్ కారణమా.?

Kingdom first single : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ ప్రొడ్యూసర్స్ లో నాగ వంశీ ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ బ్యానర్స్ లో హారిక హాసిని క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తారు. త్రివిక్రమ్ బయట బ్యానర్ తో సినిమాలు చేయటం మానేసి చాలా ఏళ్లు అయింది అని చెప్పాలి. ఇది త్రివిక్రమ్ కి ఒక హోం బ్యానర్ అని చెప్పాలి. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను నిర్మించారు. ఈ బ్యానర్ లో నాగవంశీ సినిమాలు చేస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్ లో రిలీజ్ అయ్యాయి. జెర్సీ వంటి నేషనల్ అవార్డు ఫిలిం కూడా తెరకెక్కించిన ఘనత ఈ బ్యానర్ కి ఉంది. ఇక ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా స్పెషల్ అట్రాక్షన్ గా మారుతారు నిర్మాత నాగ వంశీ.


డిస్ట్రిబ్యూటర్ గా కూడా సక్సెస్

కేవలం నిర్మాతగానే కాకుండా డిస్టిబ్యూటర్ గా కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా దేవర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు నాగ వంశీ. ఈ సినిమాకి సంబంధించి మంచి లాభాలు వచ్చాయని చెబుతూ వచ్చారు. ఇకపోతే ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం అలానే కొంతమందికి సినిమా నచ్చడంతో సినిమా హిట్ దిశగా మారిపోయిందని చెప్పాలి. హారిక హాసిని బ్యానర్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా మొదట నెగిటివ్ టాక్ ని సాధించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ త్రివిక్రమ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ వలన ఆ సినిమా కూడా మంచి సూపర్ హిట్ గా నిలిచింది.


కింగ్డమ్ అప్డేట్ రాయలేదు

గౌతం తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా కూడా ప్రస్తుతం బ్యానర్ లో నిర్మితమవుతుంది. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా టూ పార్ట్స్ లో రానున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా విజయ్ దేవరకొండ ను చూపించాడు గౌతం. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ప్రోమో రేపు రిలీజ్ కానుంది. మామూలుగా అనిరుద్ మ్యూజిక్ అంటేనే చాలామంది బోలెడు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, అలానే విజయ్ దేవరకొండ కాంబినేషన్ కాబట్టి ఈ అప్డేట్ ఇంకా వైరల్ అవ్వాలి. కానీ దీన్ని చాలామంది రాయడం మానేశారు. దీనికి మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ లో నాగ వంశీ మాట్లాడిన మాటలు కారణమని తెలుస్తుంది. డైరెక్ట్ గా నాగ వంశీ నా సినిమాల గురించి రాయకండి రివ్యూలు ఇవ్వకండి అంటూ ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు గురించి అందరికీ తెలిసిన విషయమే.

Also Read : Champion : ఆల్మోస్ట్ మహానటి సినిమాకి పెట్టినంత బడ్జెట్ పెడుతున్నారు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×