Drinking Water Before Brushing: ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇది నిజమా ? కాదా ? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. బ్రష్ చేయకుండా నీరు తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి అనేది నిజం. బ్రష్ చేయకుండా ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఉదయం లేవ గానే బ్రష్ చేయడం అందరికీ అలవాటు ఉంటుంది. కానీ ఇక నుండైనా ఈ పద్దతిని మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే రాత్రి పడుకున్న తర్వాత మన నోటిలోని లాలాజలంలో విటమిన్ బి 12 ఉత్పత్తి అవుతుందట. ఈ విటమిన్ మన శరీరంలో తయారు అవ్వదు. విటమిన్ బి 12 మనం ఆహారం ద్వారానే తీసుకుంటాము. కానీ ఇలా చేయకుండా బ్రష్ చేయడానికి ముందు నీరు తాగడం వల్ల లాలాజలంలోని విటమిన్ బి 12 పేగుల్లోకి చేరుకుంటుంది. ఫలితంగా దంత సమస్యలు రాకుండా ఉంటాయి.
నీరు:
ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల మన శరీరం యొక్క జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతం అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
రాత్రి నిద్రపోతున్నప్పుడు నోటిలో లాలాజలం ఏర్పడుతుంది. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల, నీటితో పాటు లాలాజలం కూడా కడుపులోకి వెళుతుంది. ఇది కడుపు సంబంధిత అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.
Also Read: ఈ టీ తాగితే.. ఆరోగ్య సమస్యలు రమ్మన్నా రావు !
ఆమ్లత్వం:
ప్రతి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగితే మీ కడుపు ఉదయం పూర్తిగా శుభ్ర పడుతుంది. దీంతో మీకు కడుపులో గ్యాస్ సమస్య ఉండదు.
కొవ్వు:
ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చని నీరు త్రాగడం వల్ల మీ బరువును నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు కూడా ఉదయం పూట నీరు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.