E-Paper
Advertisement

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు దుర్మరణం!

జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం.. చెట్టును ఢీకొట్టిన కారు, ఇద్దరు యువకులు దుర్మరణం!
Advertisement

Jangaon: జనగామ జిల్లాలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

స్థానికులు సమాచారం ప్రకారం.. హన్మకొండకు చెందిన అసద్, హబీబ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి కర్ణాటకలోని గుల్బార్గాకు వెళ్లారు. అక్కడ దర్గాను దర్శించుకుని తిరిగి తమ సొంత ఊరైన హన్మకొండకు ఎర్టిగా కారులో వస్తున్నారు. ఈ క్రమంలోనే గోవర్ధనగిరి దర్గా సమీపానికి రాగానే ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును చాలా బలంగా ఢీకొట్టింది.

Advertisement

ఈ ప్రమాదం ఎంత వేగంగా జరిగిందంటే.. కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నలిగిపోయింది. సీట్లలో కూర్చున్న అసద్, హబీబ్ ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారులో ఉన్న మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగున వచ్చి కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

Also Read: విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ కుంభకోణం.. 15 మంది అధికారులు సస్పెండ్!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×