BigTV English

Jr.NTR car accident: యంగ్ టైగర్ కు యాక్సిడెంట్.. మణికట్టు,వేళ్లకు తీవ్ర గాయాలు

Jr.NTR car accident: యంగ్ టైగర్ కు యాక్సిడెంట్.. మణికట్టు,వేళ్లకు తీవ్ర గాయాలు

jr.NTR joined in private hospital due to the car accident: జూబ్లీహిల్స్ లో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమచేతి మణికట్లు కు గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బతగలిందన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు గత రాత్రే తాను నటించిన దేవర మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపారు.


యాక్సిడెంట్ల గండం

నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ల గండం ఉన్నట్లు గతంలో జరిగిన సంఘటనలు రుజువుచేస్తున్నాయి. అప్పట్లో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా తండ్రి హరి కృష్ణ కూడా అదే తరహాలో రోడ్డు యాక్సిడెంట్ కు గురై మృతిచెందారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ తమ సొంత బ్యానర్ లో రూపొందే సినిమాలకు ముందు మాటగా కారు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఓ మెసేజ్ కూడా ఇస్తున్నారు. హరికృష్ణ మరణానంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి ఇలాంటి మెసేజ్ తమ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ముందు ప్రకటిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.


ప్రత్యేక ప్రార్థనలు

గతంలోనూ తెలుగుదేశం ప్రచార సన్నాహాలలో పాల్గొన్న జూనియర్ ఖమ్మం వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యారు. ఎన్టీఆర్ కు ఇది రెండో సారి. ఈ సంఘటన తెలిసి చాలా మంది సినీ ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శిస్తున్నారు. అభిమానులైతే కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులుగానీ, వైద్యులు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని అభిమానులు ఎలాంటి ఆందోళన పడక్కర్లేదని అంటున్నారు. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో కోలుకోవాలని గుళ్లల్లో ప్రత్యేక పూజలు, ప్రార్ణనలు చేస్తున్నారు.

Related News

TamilNadu News: పరోటా కోసం వెళ్లి ప్రాణాలే పొగొట్టుకున్నాడు.. అసలేం జరిగిందంటే..?

Hyderabad News: గణేష్ ఉత్సవాలు.. మహిళలతో అసభ్య ప్రవర్తన, మొత్తం 1612 మంది అరెస్ట్

Jogulamba Gadwal: పత్తి చేనులో పిడుగు పడి.. ముగ్గురు మృతి

AP Student Murder: తుపాకీతో కాల్చి.. ఢిల్లీలో చిలకలూరిపేట యువకుడు మృతి

Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?

Eluru News: ఆడిటర్ అంటూ ఆట ఆడేశాడు.. 2 కిలోల బంగారంతో పరార్, ఫైనాన్స్ కంపెనీలో మోసం

Big Stories

×