Telangana by Election Notification Release: తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ మేరకు నేటి నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఒకవేళ ఎన్నికల అవసరమైతే..సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇదిలా ఉండగా, కె. కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఉప ఎన్నికల్లో ఎన్నికయ్యే వారు 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.