Contract Killing Lover Husband| వివాహేతర సంబంధాలు చాలాసార్లు హింసాత్మక ఫలితాలనిస్తాయి. తాజాగా ఒక వివాహిత మహిళ ప్రేమలో పడ్డ ఒక యువకుడు తన ప్రియురాలి భర్త, తండ్రిని హత్య చేయాలని ప్రయత్నించాడు. కానీ పొరపాటున తప్పుడు వ్యక్తి చనిపోయాడు. దీంతో ఆ ప్రియుడి కుట్ర గురించి పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో పోలీసులు ఇటీవల ఇద్దరు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. వారిద్దరూ ఒక ట్యాక్సీ డ్రైవర్ హత్య కేసులో పట్టుబడ్డారు. ఆ హత్యకేసులో విచారణ చేయగా.. ఈ కిరాయి హంతకులు తప్పుడు వ్యక్తిని తుపాకీతో కాల్చారని.. నిజానికి ఒక వ్యక్తి తన ప్రియురాలి భర్త, తండ్రిని చంపడానికి వీరికి డబ్బులు ఇచ్చాడని తేలింది.
లక్నో సీనియర్ పోలీస్ ఆఫీసర్ రవీనా త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్తాబ్ అహ్మద్ అనే వ్యక్తి ఒక వివాహిత మహిళను ప్రేమించాడు. అయితే ఆమెను పెళ్లిచేసుకునేందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్త, తండ్రిని చంపేయాలని భావించాడు. అందుకే ప్లాన్ ప్రకారం.. కిరాయి హంతకుడైన యాసిర్‌ని సంప్రదించాడు. తన ప్రియురాలు తండ్రి తమ ప్రేమకు అంగీకరించడం లేదని అతడిని చంపేయాలని చెప్పాడు. అందుకోసం యాసిర్ కు డబ్బులు కూడా ఇచ్చాడు. అయితే యాసిర్ ఒంటరిగా వెళ్లకుండా తన స్నేహితుడు కృష్ణకాంత్ తో కలిసి డిసెంబర్ 30, 2024 రాత్రి లక్నోలోని మదేహ్‌గంజ్ ప్రాంతానికి వెళ్లారు.
Also Read: సంతానం లేని మహిళలను గర్భవతి చేస్తే రూ.10 లక్షలు.. బిహార్‌లో బంపర్ స్కామ్
ఆ ప్రాంతంలో ఆఫ్తాబ్ ప్రియురాలి తండ్రి ఇర్ఫాన్ నివసిస్తున్నాడు. కానీ ఇద్దరు కిరాయి హంతకులు బైక్ పై వెళ్లి.. ఆ ప్రాంతంలో నివసించే మొహమ్మద్ రిజ్వాన్ తుపాకులతో కాల్చేశారు. దీంతో పోలీసులు మొహమ్మద్ రిజ్వాన్ హత్య కేసులో విచారణ మొదలుపెట్టారు. విచారణలో రిజ్వాన్ ఒక ట్యాక్సీ డ్రైవర్ అని.. అతనికి ఎవరితోనూ శత్రుత్వం లేదని తేలింది. దీంతో పోలీసులు.. సిసిటీవి వీడియోల ద్వారా పరిశీలిస్తే.. ఆ కాల్పులు చేసింది కృష్ణకాంత్ అని గుర్తించారు. పోలీసులు సిసిటీవి వీడియో ఆధారంగా కృష్ణకాంత్, యాసిర్ ని అరెస్ట్ చేశారు.
వారిద్దరినీ పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించగా.. కృష్ణకాంత్ జరిగినదంతా చెప్పేశాడు. యాసిర్ స్నేహితుడు ఆఫ్తాబ్ డబ్బులిచ్చి హత్య చేయమన్నాడని తెలిపారు. అయితే ఆఫ్మాబ్ గురించి విచారణ చేసి అతడిని కూడా అరెస్ట్ చేశారు. అప్పుడు ఆఫ్తాబ్ చెప్పింది విని.. పోలీసులు ఆశ్చర్యపోయారు. నిజానికి ట్యాక్సీ డ్రైవర్ రిజ్వాన్ కి బదులు తన ప్రియురాలి తండ్రి ఇర్ఫాన్ ని చంపాల్సి ఉండగా.. కిరాయి హంతకులు పొరపాటున రిజ్వాన్ పై కాల్పులు జరిపారని చెప్పాడు.
Also Read: టిండర్ యాప్‌లో స్వలింగ సంపర్కుల డేటింగ్.. కిడ్నాప్ చేసి దోపిడి
పోలీసులు కిరాయి హంతకుల నుంచి మూడు సెల్ ఫోన్లు, ఒక నాటు తుపాకీ, 14 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.