Hyderabad News: జల్సాలకు అలవాటు పడ్డాడు ఓ వ్యక్తి. తన అప్పులు తీర్చేందుకు ఫ్రెండ్ ఇంటిని టార్గెట్ చేశాడు. పోలికలు ఏ మాత్రం తెలియకుండా లేడీ గెటప్ వేసుకొని వెళ్లి దొంగతనం చేశాడు. అందినకాడికి దోచేసి అక్కడి నుంచి సైలెంట్‌గా జారుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ బంజరాహిల్స్‌లో వెలుగు చూసింది. ఈ కేసుల లోతుల్లోకి వెళ్తే..
నేరాలు గతంలో జరిగాయి.. ఇప్పుడూ కంటిన్యూ అవుతున్నాయి. టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో నేరాల రూపం అయితే మారింది. అందుకు ఎగ్జాంఫుల్ బంజారాహిల్స్‌లో ఇంటి చోరీ కేసు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఈనెల 16న చోరీ జరిగింది. టెక్నిషియన్‌గా పని చేస్తున్న హర్షిత్ అనే యువకుడు.. తన స్నేహితుడు శివరాజ్ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఇంతకీ హర్షిత్ చోరీ చేయడానికి కారణాలేంటి? శివరాజ్-హర్షిత్‌లు మాంచి ఫ్రెండ్స్. జల్సాలకు అలవాటుపడిన హర్షిత్.. లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు. లోన్ యాప్ గురించి చెప్పనక్కర్లేదు.
ఎంత కట్టినా ఇంకా డబ్బులు కట్టాలంటూ బాధితుల నుంచి గుంజుతూ ఉంటాయి. ఆ విధంగా చాలామంది బాధితులు బయటకు వచ్చారు. ఎంత కట్టినా అప్పు తీరకపోవడంతో చోరీకి పాల్పడాలని నిర్ణయించాడు. ఎక్కడ? ఏంటి? అనేది ఆలోచన చేస్తున్నాడు. ఆ సమయంలో ఫ్రెండ్ శివరాజ్ కుటుంబసభ్యులు మ్యారేజ్ నిమిత్తం నిజామాబాద్ వెళ్లారు.
ALSO READ: బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ముగ్గురు మృతి
ఫ్రెండ్ ఇల్లు అణువణువు తెలియడంతో ఆ ఇంటిని చోరీ చేస్తే బెటరని నిర్ణయానికి వచ్చేశాడు. బంజారాహిల్స్ ఉదయనగర్‌లోని మంగళవారం శివరాజ్ ఇంటికి లేడీ గెటప్‌లో వెళ్లాడు హర్షిత్. ఇంటి తాళాలు పగలగొట్టి దాదాపు 7 తులాల బంగారం, లక్షలకు పైగానే నగదు చోరీ చేశాడు. అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయాడు.
నిజామాబాద్ నుంచి ఇంటికి రాగానే శివరాజ్ ఇల్లు చోరీ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శివరాజ్ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. లేడీ గెటప్‌లో వచ్చిన వ్యక్తికి ఇంటికి సంబంధించిన విషయాలు తెలిసి ఉంటాయని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
శివరాజ్ ఇంటికి వచ్చినవారిని విచారణ చేపట్టారు. చివరకు హర్షిత్‌పై అనుమానం వచ్చి విచారణ చేపట్టారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. దొంగతనం చేశానని లోన్ యాప్‌లో తీసుకున్న రుణం చెల్లించడానికి ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పాడు.
నిందితుడి నుంచి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పకనే చెప్పింది ఈ కేసు. తస్మాత్ జాగ్రత్త.
ఆడ వేషం కట్టి స్నేహితుడి ఇంట్లో చోరీ
లోన్ యాప్‌లో చేసిన అప్పులు తీర్చడానికి స్నేహితుడింటికే కన్నం వేసిన హర్షిత్ అనే వ్యక్తి.
హైదరాబాద్-బంజారాహిల్స్ ఉదయ్ నగర్‌కు చెందిన శివరాజ్ ఇంట్లో ఈ నెల 16న చోరీ.
స్నేహితుడి కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారని తెలుసుకుని ఆడ వేషంలో ఇంట్లో చోరీ… pic.twitter.com/MMX1lsus13— ChotaNews App (@ChotaNewsApp) September 21, 2025