Bapatla Road Accident: మృత్యువు ఏ రూపంలో వస్తుందో అస్సలు ఊహించలేము.. బాపట్ల జిల్లా రోడ్డు ప్రమాదంలో అదే జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. కుక్కను తప్పించబోయాడు కారు డ్రైవర్. నేరుగా డివైడర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్ లో ముగ్గురు మృతి చెందారు.
ఆదివారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయిన కారు డ్రైవర్, నేరుగా డివైడర్‌ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతులు లక్ష్మణ్(70), సుబ్బాయమ్మ(65), హేమంత్(25)గా గుర్తించారు. తిరుపతి నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పిఠాపురంలోని ఓ గుడిలో పిండప్రదానం చేసేందుకు వెళ్తుండగా కారులో ముగ్గురు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అతివేగం, కుక్క అడ్డురావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఘటన గురించి తెలియగానే హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారుని పక్కకు తొలగించారు. గాయపడినవారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ: సంచిలో డెడ్ బాడీ కేసులో పురోగతి.. ఆ మహిళ ఎవరంటే
అనకాపల్లిలో మరో ఘటన
మరోవైపు అనకాపల్లి జిల్లాలో యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న లారీని ఢీ కొట్టింది బస్సు. నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢీ కొనడంతో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి టోల్ గేట్ వద్ద లారీని పక్కకు నిలిపాడు డ్రైవర్. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.
కుక్కను తప్పించబోయి.. మృత్యు ఒడిలోకి..!
మార్టూరు మండలం కోలలపూడి సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
కుక్కను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్న కారు
ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మృతులు లక్ష్మణ్(70), సుబ్బాయమ్మ(65), హేమంత్(25)గా… pic.twitter.com/kRIuEenRY6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 21, 2025