Man suicide Girlfriend home| కర్ణాటకలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ప్రేమ కోసం తపించే ఒక యువకుడు ప్రియురాలి ఇంటి ముందు నిలబడి తనని తాను బాంబుతో పేల్చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో ఆదివారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లా నాగమంగళా తాలుక కు చెందిన రామచంద్ర అనే యువకుడు ఆదివారం డిసెంబర్ 29, 2024 ఉదయం కాలెనహళ్లి గ్రామంలోని తన ప్రియురాలి ఇంటి ముందు నిలబడి క్వారీలు పేల్చే ఒక జెలటిన్ స్టిక్ బాంబుతో తన చేతిలో పట్టుకొని పేల్చుకున్నాడు. దీంతో రామచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. తాను ప్రేమించిన అమ్మాయితో వివాహం చేయడానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనస్తాపం చెందిన రామచంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సోమవారం మీడియాకు ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు.
గతంలో జైలుకెళ్లిన రామచంద్ర
కాలెనహళ్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ యువతిని (17) పక్క గ్రామనికి చెందిన రామచంద్ర ప్రేమించాడు. ఈ విషయం ఇంట్లో తెలియడంతో ఇరు వైపులా గొడవలు జరిగాయి. తాను ఆ యువితినే పెళ్లిచేసుకుంటానని రామచంద్ర పట్టుబట్టాడు. దీంతో రామచంద్ర తల్లిదండ్రులు అతని ప్రేయని తండ్రిని పెళ్లి సంబంధం కోసం అడిగారు. కానీ రామచంద్రను వివాహ ప్రస్తావనను ఆయన తిరస్కరించాడు.
Also Read: ప్రియురాలి పగ.. పథకం వేసి ప్రియుడి ఆ భాగం కోసేసిన యువతి..
దీంతో భంగపడ్డ ప్రేమికులిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఈ కారణంగా యువతి తండ్రి రామచంద్రపై పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశాడు. అమ్మాయి మైనర్ కావడంతో ఆమె ఇష్టానుసారంగా రామచంద్రతో వెళ్లిపోయిన రామచంద్రపై కిడ్నాపింగ్ కేసు నమోదు చేశారు. ఆ తరువాత పోలీసులు రామచంద్రను కొన్ని రోజుల్లోనే వెతికి పట్టుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు కావడంతో కేసు విచారణ సమయంలో రామచంద్ర మూడు నెలలు జైల్లో ఉన్నాడు.
మరోవైపు అదే సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించారు. కోర్టులో కేసు ఉండగా.. రామచంద్ర తల్లిదండ్రులు రాజీ పడడంతో యువతి తల్లిదండ్రులు కేసు ఉపసంహరించుకున్నారు. కానీ రామచంద్ర జైలు నుంచి బయటికి వచ్చాక కూడా తన ప్రియురాలిని తరుచూ కలిసేవాడు. మరి కొన్ని నెలల్లో యువతి వివాహం జరుగనుందని తెలిసి మరోసారి రామచంద్ర యువతి తల్లిదండ్రులతో కలిసి తమ ప్రేమకు అడ్డుపడొద్దని ప్రాధేయపడ్డాడు. కానీ వారు అందుకు అంగీకరించలేదు.
దీంతో మనస్తాపానికి గురైన రామచంద్ర చేతిలో క్వారీ జెలటిన బాంబు పట్టుకొని తన ప్రియురాలి ఇంటి ముందుకు ఆదివారం ఉదయం చేరుకున్నాడు. అక్కడ ఆమె పేరును గట్టిగా పిలుస్తూ బాంబుని పేల్చేశాడు. రామచంద్ర కుటుంబం క్వారీ బిజినెస్ చేస్తుండడంతో అతనికి జెలటిన్ బాంబు అందుబాటులో ఉంది. ఈ జెలటిన్ బాంబులకు లైసెన్స్ అవసరం లేదని.. కొండలు, పెద్ద పెద్ధ రాళ్లు పేల్చడానికి వీటిని ఉపయోగిస్తారని పోలీసులు తెలిపారు.
Also Read: భోజనం ఆలస్యమైందని పెళ్లి క్యాన్సిల్.. మరో యువతితో వరుడి వివాహం!
మరోవైపు రామచంద్ర కుటుంబ సభ్యులు యువతి కుటుంబంపై కేసు నమోదు చేశారు. రామచంద్రను వారే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.