Lovers Suicide: రెండు మనసులను ఏకం చేసిన ప్రేమ.. రెండు కుటుంబాలను కలపలేకపోతోంది. చావడానికి ధైర్యం ఇస్తోంది కానీ.. పెద్దల్ని ఒప్పించే శక్తిని ఇవ్వలేకపోతోంది. కుల, మతాలకు అతీతంగా ఆదరించే ప్రేమ.. ప్రేమికులకు జీవితంపై భరోసాన్ని ఇవ్వలేకపోతోంది. ప్రేమే ప్రాణంగా బ్రతుకుతున్న వారికి.. బతుకే నిజమైన ప్రేమ అని చెప్పలేకపోతోంది. ఫలితంగా.. ప్రేమించిన వారితో కలిసి బతలేక.. చావులోనైనా తోడుగా ఉండాలనే క్షణికావేశాలతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు నేటి యువత.
కొన్ని రోజులుగా అవే వరస ఉదంతాలు తీవ్రంగా కలవర పెడుతున్నాయి. పరివక్వత లేని ప్రేమ వ్యవహారం ఇద్దరు ప్రాణం తీసింది. అబ్బాయికి 18 ఏళ్లు.. అమ్మాయికి 20 ఏళ్లు.. గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అంతా సాఫీగానే సాగుతుందనుకున్న టైమ్‌లో ఊహించని పరిణామం. రెండు కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. గూడ్స్‌రైలు కిందపడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. ప్రేమవ్యవహరమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
పాపయ్యపల్లి గ్రామం వద్ద ఉన్న రైల్వే ట్రాకుల ప్రక్కన ఒక యువతి, యువకుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిద్దరినీ రాచపల్లి గ్రామానికి చెందిన రాహుల్, ఎర్ర చింతల్ గ్రామానికి చెందిన శ్వేతగా గుర్తించారు. వీరిద్దరికి ఇన్ స్టాలో పరిచయమై.. ప్రేమగా మారింది.
రాహుల్ ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయ్యి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. శ్వేత కరీంనగర్‌లో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో BA మొదటి సంవత్సరం చదువుతుంది. శివరాత్రి పండుగకు ఇంటికి వెళ్లిన శ్వేత ఇటీవల కరీంనగర్ కళాశాలకు వచ్చింది.
కాగా ఆదివారం రాత్రి ఇద్దరూ జమ్మికుంట మండలం పాపయ్యపల్లి శివారులోని రైల్వేట్రాక్ పై ఆత్మహత్యుకు పాల్పడేందుకు సిద్దపడ్డారు. వీరిద్దరి మృతదేహాలు రైల్వేట్రాకు పక్కన పడి ఉండటంతో గుర్తించిన గూడ్స్‌రైల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనితో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
వీరి మధ్య లవ్ ఎక్కడ, ఎలా చిగురించిందో తెలీదు కానీ.. ఇద్దరు ఏ నిర్భందాలు లేకుండానే సున్నిత మనస్తత్వంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకున్నాడనే.. రాహుల్ తండ్రి రాజు ఫిర్యాదు చేయగా.. ఏ కారణంతో చనిపోయిందో తెలీదు అని శ్వేత తండ్రి రాజలింగు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏదీ ఏమైనా వీరి ఇద్దరు ఆత్మహత్య ఓ మిస్టరీగా మిగిలింది.
Also Read: భార్య ప్రియుడే హంతకుడు.. స్నేహితుడిగా నటిస్తూ కుట్ర
పెళ్లికి పెద్దలు అంగీకరించరూ అనే భయంతోనే వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిద్దరు మృతితో ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంత మవుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఏదో ఒక చోట ప్రేమ జంట చావు బతుకులతో పోరాడుతూనే ఉంది. పెద్దలు అంగీకరించక పోయినా.. పెళ్లి చేసుకుని ఎక్కడో ఒక చోట జీవించవచ్చు. కానీ, అనవసర ఆలోచనలతో ప్రేమికులు ఈ లోకం వదలి వెళుతున్నారు. ఈ చేదు ఘటనలకు కారణం.. పెద్దలా..? లేదా ప్రేమికులా..? ఎవరైతేనేం.. జీవితంలో ఇంకా ఎన్నో చూడాల్సిన రెండు జీవితాలు మాత్రం అర్ధాంతరంగా ఆరిపోతున్నాయి కదా..! మధ్యలో మరెంతోమంది సంబంధం లేని వారి జీవితాలు తలకిందులు అవుతున్నాయి.