BigTV English

NTR: గంగిరెడ్డి… అల్లుడు ఎట్టా ఉండాడు?

NTR: గంగిరెడ్డి… అల్లుడు ఎట్టా ఉండాడు?

NTR: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడు. వార్ 2 సినిమా కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్, పాపరాజ్జీ తీసిన ఫోటోల్లో స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాడు. సింపుల్ బ్లాక్ టీషర్ట్ లో ఎన్టీఆర్ స్టైల్ అండ్ కూల్ గా ఉండడంతో ఫ్యాన్స్ ఈ ఫోటోస్ ని ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.


వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ని ఫేస్ చేస్తున్నాడు. “రోగ్ రా ఏజెంట్… రాఘవన్” పాత్రలో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ ప్లే చేస్తున్నాడు. పాజిటివ్ నుంచి నెగటివ్ ఆర్క్ కి షిఫ్ట్ అయ్యే పాత్రలో ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ నుంచి టఫ్ కాంపిటీషన్ ఎదురవనుంది. ఈ కాంపిటీషన్ ని తట్టుకోని నిలబడడానికే ఎన్టీఆర్ అంత ఫిట్ గా రెడీ అయ్యాడని టాక్.

వార్ 2 టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యి హ్యూజ్ సాంగ్ షూటింగ్ బాలన్స్ ఉంది అనుకుంటున్న సమయంలో… హ్రితిక్ రోషన్ కి ఇంజ్యూరి అవ్వడంతో సాంగ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. మరి హ్రితిక్ రోషన్ కోలుకున్నాడా లేక మరేదైనా పార్ట్ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే వార్ 2 సినిమా ఆగస్ట్ రిలీజ్ కి ఎలాంటి డిలే కాకుండా రెడీ అవుతోంది.


ఈ ఎపిక్ యాక్షన్ మూవీ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచే బజ్ జనరేట్ చేసింది. ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యి, మేకర్స్ నుంచి ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదా ఒక ఫోటో బయటకి వస్తే చాలు ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వడం గ్యారెంటీ. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో డేట్స్ కేటాయించనున్నాడు కాబట్టి ఈ మూవీని వీలైనంత త్వరగానే పూర్తి చేసే అవకాశం ఉంది. నీల్ ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడు అనే క్యూరియాసిటీ మూవీ లవర్స్ లో ఉంది. నీల్ మార్క్ ఎలివేషన్స్ ఎన్టీఆర్ పడితే చాలు బాక్సాఫీస్ దగ్గర ఎన్టీఆర్ విధ్వంసం సృష్టించడం గ్యారెంటీ.

ఇక ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే కొరటాల శివతో దేవర 2 సినిమా చేయడానికి రెడీ అవుతాడు. దేవర ఫస్ట్ పార్ట్ డివైడ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీతో బయ్యర్స్ కి ప్రాఫిట్స్ తెచ్చి పెట్టాడు. పార్ట్ 1లో చాలా చిక్కులని వదిలేసిన కొరటాల శివ, వాటిని పార్ట్ 2లో క్లియర్ చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల శివ మరికొన్ని రోజుల్లో ప్రీవర్క్స్ ని స్టార్ట్ చేయనున్నాడు. అనిరుద్ మ్యూజిక్, ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ ఎలివేషన్స్ తో దేవర 2 పవర్ ప్యాక్డ్ గా కనిపిస్తోంది. మరి వార్ 2, నీల్ ప్రాజెక్ట్, దేవర 2 సినిమాలతో ఎన్టీఆర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×