Roja:ఆర్కే రోజా(RK Roja).. టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకుంది. సినిమాలలో చాలామంది స్టార్ హీరోల సరసన నటించి, భారీ పాపులారిటీ అందుకున్న రోజా.. ఆ తర్వాత స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టి జబర్దస్త్(Jabardast ) కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి, భారీ పాపులారిటీ అందుకుంది. ఒకవైపు జబర్దస్త్ లో కొనసాగుతూనే.. మరొకవైపు రాజకీయాలలో చక్రం తిప్పిన ఈమె .. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జబర్దస్త్ కి దూరమైంది. ఇక పూర్తిగా టీవీ షోలు , సినిమాలు చేయనని.. ప్రజలకే నా జీవితం అంకితం అంటూ అప్పట్లో ఎమోషనల్ అయింది.
బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చిన రోజా..
అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ పార్టీ ఓడిపోవడమే కాకుండా ఆ పార్టీ తరఫున నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజా కూడా ఓడిపోవడంతో.. రోజా అడపాదనప మాత్రమే రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతోంది. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. జీ తెలుగు “సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4” లోకి ఎంట్రీ ఇచ్చింది రోజా. తాజాగా ఈ షో కి సంబంధించి ప్రోమో రిలీజ్ చేయగా ఈ ప్రోమోలో రోజా డాన్స్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసింది. రోజా తో పాటు శ్రీకాంత్ (Srikanth), రాశి(Rasi) కూడా ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ షో మార్చి 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో అషు రెడ్డి (Ashu Reddy), యాంకర్ రవి (Ravi)యాంకర్స్ గా చేయనున్నారు. ఇకపోతే ప్రభుత్వం మారడంతో మరో నాలుగేళ్లు ఖాళీగా ఉండడం ఎందుకు అని ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు బిజీగా ఉండడానికి ఇలా రోజా టీవీ షోలోకి ఎంట్రీ ఇచ్చి సందడి చేయబోతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రోజా బుల్లితెరపై మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ లేడీ బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Hollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్ కన్నుమూత..!
జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందా.?
ఇదే సమయంలో కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం రోజా బుల్లితెర పైకి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేసినా.. ఈ షో కి టెంపరరీగా వచ్చిందా? మళ్లీ ఎన్నికలు అయ్యేవరకు ఇలా టీవీ షోలో కనిపిస్తుందా.. ? ఈ షో తో పాటు జబర్దస్త్ లోకి కూడా అడుగుపెడుతుందా ? అంటూ పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రోజా మాత్రం ప్రస్తుతానికి రీఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఎగ్జైట్ ఫీలవుతున్నారని చెప్పవచ్చు. ఇకపోతే జబర్దస్త్ లో రోజాతో పాటు నాగబాబు (Nagababu ) కూడా జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక అటు నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకర్త బిజీగా ఉన్నారు. ఇక ఆయన మళ్లీ రి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనబడడం లేదు. ఇప్పుడు రోజా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి ఈమెను జబర్దస్త్ కి తీసుకొస్తారా..? లేదా అనేది తెలియాలి.