BigTV English

Two Women Suicide For Lover : ముక్కోణపు ప్రేమ కథ ట్రాజెడీ.. ప్రియుడి కోసం విషం తాగిన ఇద్దరు యువతులు

Two Women Suicide For Lover : ముక్కోణపు ప్రేమ కథ ట్రాజెడీ.. ప్రియుడి కోసం విషం తాగిన ఇద్దరు యువతులు

Two Women Consume Poison For Same Lover | ప్రేమ గుడ్డిదంటారు. భావోద్వేగంలో మంచి చెడు అనే విచక్షణ ఉండదు. తాము ప్రేమించే దాని కోసం మనిషి ఏమైనా చేస్తాడు. దాన్ని పొందకపోతే నైరాశ్యంతో జీవితానికి అర్థం లేదని భావిస్తాడు. ఈ క్రమంలో ప్రేమ కోసం ప్రాణాలు బలిగొన్ని వారు ఎందరో. కానీ తాజాగా ఒక విచిత్ర ఘటన జరిగింది. ఒకే యువకుడిని ఇద్దరు యువతులు ప్రేమించారు. అతను దక్కకపోయే సరికి విషం తాగారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్చగా ఒకరు మరిణించారు. మరో యువతి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ట్రై యాంగిల్ లవ్ ట్రాజెడీ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లాలకు చెందిన దివాకర్ అనే యువకుడిని రేష్మ, శారద అనే యువతులు ప్రేమించారు. అయితే వీరిద్దరిలో దివాకర్ ఎవరిని ప్రేమించాడో స్పష్టత లేదు. దివాకర్ గాఢంగా ప్రేమించిన ఈ ఇద్దరు యువతులు తమ ప్రేమ దక్కదని తెలిసి బాధపడ్డారు. దివాకర్ లేని ప్రపంచ తమకు వృథాగా భావించి ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. అందుకోసం ముందుగానే ప్లాన్ చేశారు.

Also Read: ఉచిత వివాహం చేస్తాం.. కానుకలు ఇస్తాం.. అంతా మోసం!


ఇద్దరూ స్థానిక ఆర్టీవో ఆఫీస్ కు వెళ్లి విషం తాగారు. విషం తాగే ముందు దివాకర్ కు ఫోన్ చేసి తాము ఈ లోకాన్ని వదిలిపెట్టి పోతున్నామని తెలిపారు. ఇది తెలిసిన దివాకర్ షాక్ కు గురయ్యాడు. పరుగు పరుగున ఆర్టీవో ఆఫీస్ వచ్చాడు. కానీ అప్పటికే రేష్మ, శారద ఇద్దరూ విషం తాగేశారు. వారి పరిస్థితి చూసి ఏం చేయాలో తోచక దివాకర్ ఇద్దరినీ ఆస్పత్రికి తన భుజాలపై తీసుకెళ్లాడు.

అయితే ఆస్పత్రిలో ఇద్దరి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు వారిద్దరూ ఏ విషం తాగారో అడిగారు. ఆ యువతులిద్దరూ సూపర్ వాస్కోల్ (జుట్టుకు రంగు వేసే కెమికల్) తాగారని తెలిసి చికిత్స ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు శారద చికిత్స పొందుతూ మరణించింది. మరోవైపు రేష్మ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

శారద చనిపోయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి దివాకర్ పై ఫిర్యాదు చేశారు. అతడి వల్లే తమ కూతురు చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రియుడి కోసం ఆత్మహత్య చేసుకున్న వివాహిత.. ఆ వెంటనే ప్రియుడు కూడా
ఇలాంటి విషాద ఘటన పంజాబ్ లో కూడా జరిగింది. అక్కడ ఫగ్వాడా ప్రాంతంలోని మంధలి గ్రామానికి చెందిన రిచా భరద్వాజ్ అనే 33 ఏళ్ల యువతికి 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు తన భర్త ద్వారా ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ తరువాత ఆమెకు తన గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అలియాస్ సన్నీని ప్రేమించింది. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలేసి అతనితో గత అయిదేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల సన్నీకి అతని కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం చేశారు. దీంతో రీచా ఉరి వేసుకొని మరణించింది. ఇది తెలిసి సన్నీ కూడా మనస్తాపానికి గురయ్యాడు. ఒక హోటల్ లో గది అద్దెకు తీసుకొని తానుకూడా ఉరి వేసుకొని చనిపోయాడు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×