Kerala Crime News: కేరళలో ఓ తల్లి తన చిన్నారులను హత్య చేసి.. ఇంట్లోనే పాతిపెట్టింది.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మానవత్వాన్ని మంటగలిపేలా.. ఉన్న ఈ విషాద ఘటన తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానికంగా వస్తున్న వివరాల ప్రకారం.. తిరువనంతపురానికి సమీపంలోని గ్రామంలో ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. మొదట్లో పక్కవారిని అడిగినా, చూసినా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో.. వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇంటిని తనిఖీ చేశారు.
అక్కడ ఇంటి వెనుక భాగంలో మట్టిని తొలగించగా, చిన్న చిన్న మృతదేహాలు బయటపడ్డాయి. విచారణలో ఒక ఆరేళ్ల మగబిడ్డ, మూడేళ్ల ఆడబిడ్డ శవాలు అని గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు.
తర్వాతి దశలో పోలీసులు చేసిన దర్యాప్తులో.. ఈ ఇద్దరినీ వారి తల్లి హత్య చేసి ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టినట్టు ఆరోపణలు వెల్లడయ్యాయి. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
పిల్లలను చంపడానికి ఆమెకు గల ఉద్దేశ్యం ఏంటన్న దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. కుటుంబ కలహాలా? మానసిక సమస్యలా? లేక ఆర్థిక ఒత్తిడా అన్నదానిపై అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారు.
ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “పిల్లలు ఎంతో చలాకీగా ఉండేవాళ్లు. వారిని ఇలా ఊహించలేని రీతిలో చూడటం బాధాకరం అని దిగ్భ్రాంతి వ్యక్తం చెందారు.
ఈ ఘటన మానసిక ఆరోగ్యంపై, కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న ఒత్తిళ్లపై సమాజాన్ని ఆలోచింపజేస్తోంది. అనేక కుటుంబాల్లో ఇటువంటి సమస్యలు కనిపిస్తున్నప్పటికీ, సమయానికి సహాయం అందకపోవడం ఇలా విషాదాంతాలకు దారితీస్తోంది.
Also Read: ఫుల్‌గా మందుకొట్టి.. కారులో ఏసీ వేసుకుని నిద్ర.. తెల్లారేసరికి ఆ ఇద్దరూ..
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు.. సత్వరంగా కౌన్సిలింగ్ లేదా వైద్య సహాయం తీసుకోవడం అవసరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం, సామాజిక సంస్థలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది.