గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా భర్తలను లేపేస్తున్న భార్యల ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. పెళ్లి చేసుకోవాలంటేనే కుర్రాళ్లకు వణుకుపుడుతోంది. ఈ నేపథ్యంలో బీహార్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. సమస్తిపూర్ జంక్షన్‌లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కలుతున్న రైలు నుంచి నవ వధువు అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు, బంధువులు రైలు అంత వెతికినా కనిపించకపోవడంతో రైల్లో గందరగోళం నెలకొంది. దర్భంగా- సమస్తిపూర్ మార్గం మధ్యలో ఈ ఘటన జరిగింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలోని టెఘ్రా నివాసి సుమిత్ కుమార్ కు, దర్భంగా లోని లాహెరియాసారాయ్ కు చెందిన అంచల్ కుమారితో 40 రోజుల క్రితం పెళ్లి అయ్యింది. రీసెంట్ గా అంచల్ కుమారి తండ్రికి గుండెపోటు వచ్చింది. అతడిని చూసి వచ్చేందుకు హౌరా-జయనగర్ ఎక్స్ ప్రెస్ ఎక్కారు. సమస్తిపూర్ స్టేషన్ సమీపంలో అంచల్ కుమారి తాను టాయిలెట్‌కు వెళ్తున్నానని సుమిత్ కు చెప్పి వెళ్లింది. ఆ తర్వాత ఎంతకీ రాకపోవడంతో సుమిత్ వాష్ రూమ్ దగ్గరికి వెళ్లాడు. ఆమె వాష్ రూమ్ లో కనిపించలేదు. సుమిత్ కుమార్ ఆమె కోసం రైలు అంతా వెతికాడు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అతడిలో ఆందోళన మొదలయ్యింది.
అంచల్ కోసం కుటుంబ సభ్యుల వెతుకులాట
సుమత్ కుమార్ రైలు అంత వెతికినా కనిపించకపోవడంతో వెంటనే తన కుటుంబ సభ్యులతో పాటు అంచల్ కుమారి కుటుంబ సభ్యులకు కాల్ చేసి చెప్పాడు. వారు కూడా ఆమె కోసం గాలించినా, దొరకలేదు. అంచల్ కుమారి తల్లి ప్రభాదేవి, తన కూతురు అదృశ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కదులుతున్న రైలు నుంచి ఆమె ఎలా అదృశ్యం అయ్యిందో అర్థం కావడం లేదని చెప్పింది.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
ఈ ఘటనపై అంచల్ కుమారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్భంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. దర్భంగా ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) ఇన్‌స్పెక్టర్ అరుణ్ కుమార్ వధవు అదృశ్యంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. వాళ్లు రైలు ఎక్కిన దగ్గరి నుంచి అమె మిస్ అయిన రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమెను కనిపెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. అటు సుమిత్ కుమార్ కూడా తన భార్య త్వరలోనే సరక్షితంగా ఇంటికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
Read Also: వందే భారత్ రైలుకు తప్పిన భారీ ప్రమాదం.. పశువులను రక్షించబోయి కాపరి మృతి!
ప్రయాణీకులలో ఆందోళన
ఈ ఘటన ప్రయాణికులలో ఆందోళన కలిగించింది. రైళ్లలో భద్రతా చర్యల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. అంచల్ కుమారి సురక్షితంగా తిరిగి రావాలని ఇరు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. పోలీసు అధికారులు సైతం ఈ కేసును ప్రత్యేక బృందాలు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆమె ఆచూకీ కనిపెడతామని తెలిపారు.
Read Also: ఛీ.. బకెట్ నిండ మలం తెచ్చి మెట్రో ప్రయాణికులపై పోసిన యూట్యూబర్!