Khammam district : ఫోన్ లో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎంటెక్ వరకూ చదివినా.. ప్రేమ కోసం ఓ మెకానిక్ ని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆస్తిపాస్తులు లేవు, అబ్బాయికి చదువులు కూడా లేదు. పైగా.. మతాంతర వివాహం. బిడ్డ భవిష్యత్తు కోసం ఆలోచించిన తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అయినా.. ఇంట్లో వాళ్లను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రేమను గెలిపించుకుంది. అక్కడే ఆమె జీవితం కష్టాల వైపు సాగింది. మెకానిక్ గా పనిచేస్తున్న భర్తను పాత కేసుల విషయంలో పోలీసులు ప్రశ్నించడం, ఇంటిని సోదాలు చేయడంతో మనస్థాపం చెందింది. ఇంటికి వరుసగా పోలీసులు వచ్చి వెళ్లడంతో అవమాన భారంతో ఇద్దరు చిన్నపిల్లలకు ఊరేసి, తాను ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ ఘటన ఖమ్మం జిల్లా, మధిర మండలంలో చోటుచేసుకుంది.
ఇంట్లో పెద్దల్ని ఎదిరించి మతాంతర విహహం చేసుకున్న ఓ జంట. భర్త మెకానిక్ గా పనిచేస్తూ సంపాదిస్తుంటే.. ఇద్దరు పిల్లలతో ఉన్నంతలో బాగానే ఉంటున్నారు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో ఆ కుటుంబాన్ని గత జీవితం వెంటాడింది. దాంతో.. చోటు మారినా అవమానాలు తప్పలేదన్న కుంగుబాటుతో ఓ మహిళ ఘోరానికి ఒడిగట్టింది. పండంటి ఇద్దరు కూతుళ్లకు ఉరితాడు బిగించి.. తాను ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో.. ఆ కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రోజుల వ్యవధిలోనే తమ కుటుంబం ఇలా రోడ్డున పడుతుందనుకోలేదంటూ.. విలపిస్తున్నారు.
ఖమ్మం జిల్లా, మధిర మండలం నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ ఇంటర్ వరకూ చదివుకున్నాడు. ఆ తర్వాత పై చదువులు మానేసి.. మెకానిక్ పని నేర్చుకున్నాడు. ఖమ్మంలోని ఓ మెకానిక్ షెడ్ లో పనిచేస్తుండే వాడు. ఆ సమయంలోనే సూర్యాపేటకు చెందిన మౌలిక అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ఫోన్ కాల్స్ తో ప్రేమగా మారింది. ఎంటెక్ వరకూ చదివిన యువతి.. పదో తరగతి చదివి మెకానిక్ గా పనిచేస్తున్న షేక్ బాజీని వివాహం చేసుకుంది. పెద్దలు వద్దన్నా.. మతాంతర వివాహం వద్దని పెద్దలు చెప్పినా వినలేదు. వీరి వివాహం జరిగి ఆరేళ్లు అవుతుంది.
పెళ్లైన కొత్తలో వీరు ఖమ్మంలో కాపురం పెట్టారు. తొలి రోజుల్లో అన్యోన్యంగానే ఉన్న దంపతులకు ఇద్దరు కూతుళ్లు.. మెహక్(4), మెసురూల్ (3) ఉన్నారు. బుద్దిగా పని చేసుకుని, భార్య బిడ్డల్ని సాదుకోవాల్సిన బాజీ.. చెడు దారి పట్టాడు. దొంగతనాలు, గొలుసు దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. వద్దని చెప్పినా, మంచిగా పని చేసుకుని బతకమని బ్రతిమిలాడినా వినలేదు. దాంతో.. కొన్ని సార్లు రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లివచ్చాడు. తల్లిదండ్రుల మాట వినకుండా, ఇష్టం వచ్చినట్లు చేసిన ఆమెకు అప్పడు పరిస్థితి అర్థం అయ్యింది. భర్త ప్రవర్తనతో తీవ్రంగా కుంగిపోయింది. పైగా.. భర్త, అతని కుటుంబానికి ఇష్టమైనట్లుగానే.. తాను ప్రవర్తించింది. తన పేరు మౌలికను భర్త కోసం ప్రెజా(32) గా మార్చుకుని, అన్ని రకాలుగా వారి పద్ధతులు పాటిస్తూ, వినయంగానే నడుచుకుంది. అయినా.. ఆ యువకుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో.. కాపురాన్ని ఐదు నెలల క్రితం ఖమ్మం నుంచి సొంత గ్రామానికి మార్చుకున్నారు.
సొంతూరు నిదాన పురంలో ఉంటున్న బాజీ ఇంటికి పోలీసులు వచ్చారు. పాత కేసులకు సంబంధించి ఇద్దరు పోలీసులు బాజీని తీసుకెళ్లారు. ఓ సెల్ ఫోన్ చోరీ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు మరోసారి ఇంటికి వచ్చిన పోలీసులు.. బాజీ దొంగిలించి ఫోన్ అమ్మిన వ్యక్తిని పట్టుకున్నారు. అదే సమయంలో షేక్ బాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. స్టేషన్ లో ఉన్న బాజీని తీసుకువచ్చుకునేందుకు.. కుటుంబ సభ్యులు ఎవరైనా ఖమ్మం స్టేషన్ కి రావాలని సూచించి వెళ్లిపోయారు. దీంతో.. షేక్ బాజీ భార్య మౌలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. జరిగిన ఘటనలతో పరుపు పోయిందని కుంగిపోయింది.
షేక్ బాజీని విడిపించుకునేందుకు ఖమ్మం వెళ్లేందుకు బయల్దేరేందుకు బాజీ తండ్రి గఫూర్ సిద్ధమవుతుండగా.. అద్దె ఇంట్లో ఉంటున్న మౌలికకు చెప్పేందుకు వెళ్లారు. ఇంటి తలుపులు తీసిన ఆయనకు నిర్ఘంతపోయే దృశ్యాలు కనిపించాయి. రేకుల ఇంట్లోని కడ్డీలకు ఇద్దరు కూతుళ్లను ఉరేసిన మౌలిక్.. తాను మరో వైపు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. అవమాన భారంతో, భర్య చేసిన పనికి సొంతూర్లో పరువుపోయిందని భావించి మౌలిక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెబుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.