Slowest Indian Train: భారతీయ రైల్వేలోకి గత కొంతకాలంగా అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు అడుగు పెట్టాయి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు.. తొలుత గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించగా, ఇప్పుడు ఆ స్పీడ్ దాదాపు 160 కిలో మీటర్లకు చేరింది. త్వరలో గంటకు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. భారతీయ రైల్వేలో హైస్పీడ్ రైళ్లు మాత్రమే కాదు, నెమ్మదగా వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. ఇంతకీ దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఏదో మీకు తెలుసా?
గంటకు కేవలం 9 కి. మీ వేగం
దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు నీలగిరి మౌంటైన్ రైలు. ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాళ్యం-ఊటీ నడుమ తన సేవలను కొనసాగిస్తున్నది. దీనిని నీలగిరి ప్యాసింజర్ రైలుగా పిలుస్తారు. నీలగిరి కొండల నడుమ అత్యంత ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తున్నది. ఈ రైలు గంటకు కేవలం 9 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నది. మొత్తం 46 కిలో మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి ఏకంగా 5 గంటల సమయం పడుతుంది. ఈ రైలు మెట్టుపాళ్యం నుంచి ఉదయం 7.10 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12 గంటలకు ఊటీకి చేరుకుంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఊటీ నుంచి బయల్దేరే ఈ రైలు సాయంత్రం 5.30 గంటలకు మెట్టుపాళ్యం స్టేషన్ కు చేరుకుంటుంది.
ఎందుకు అంత నెమ్మదిగా వెళ్తుందంటే?
ఇది మీటర్ గేజ్ రైలు మార్గం కావడంతో నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. మెట్టుపాళ్యం, ఊటీ మార్గం అంతా పర్వతాల్లోనే ఉంటుంది. పలు హిల్ స్టేషన్స్ మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. 1990లో ప్రారంభమైన నీలగిరి మౌంటైన్ రైలు దేశంలో ఉన్న ఏకైక ఆపరేషన్ రాక్ రైల్వే. ఈ రైలు స్ట్రీమ్ ఇంజిన్ తో నడుస్తన్నది. నీలగిరి మౌంటైన్ రైల్వేకు 2005లో మునెస్కో గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. నీలగిరి మౌంటైన్ రైల్వే నిర్మాణం 1854లో ప్రతిపాదించబడింది. 1891లో నిర్మాణం పనులు మొదలూ 1908లో పూర్తయింది.
Read Also: దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే వందేభారత్ రైలు.. ఏకబిగిన అన్ని కిలో మీటర్లు వెళ్తుందా?
ఆద్యంతం ఆహ్లాదకరం
ఈ రైలు ప్రయాణం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మార్గ మధ్యంలో పచ్చని తేయాకు తోటలు, దట్టమైన అడవులు. పర్వత ప్రాంతాల గుండా వెళ్తుంది. ఈ రైల్వే మార్గంలో 16 కంటే ఎక్కువ సొరంగాలు, 250 వంతెనలు, 208 మూల మలుపులను కలిగి ఉంటుంది. ఈ మార్గం అంతా పలు సవాళ్లతో కూడుకుని ఉంటుంది. అందుకే ఈ రైలును నెమ్మదిగా ముందుకు నడిపిస్తారు. ఈ రైలు బోగీలు చెక్కతో తయారు చేయబడ్డాయి, ప్రయాణీకులు నీలగిరి కొండల అందాలను తిలకించేలా పెద్ద పెద్ద కిటికీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైలు నాలుగు కోచ్ లతో నడుస్తుంది. IRCTC వెబ్ సైట్ ద్వారా ఈ రైలు ప్రయాణానికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Read Also: దేశంలో పేరు లేని ఏకైక రైల్వే స్టేషన్, రోజూ ఇక్కడ రైళ్లు కూడా ఆగుతాయండోయ్!