BigTV English

Akhanda 2 Update: బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్.. పోస్టర్ రివీల్..!

Akhanda 2 Update: బాలయ్యకు జోడీగా సంయుక్త మీనన్.. పోస్టర్ రివీల్..!

Akhanda 2 Update.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ సినిమా జనవరి 12వ తేదీన విడుదల అయ్యి మంచి కలెక్షన్స్ వసూలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ‘అఖండ’లో ప్రేక్షకులను ఈ కాంబినేషన్ ఆకట్టుకోవడంతో మళ్ళీ డాకు మహారాజ్ లో కూడా కాంబినేషన్ రిపీట్ అయింది. కానీ ఈ సినిమాలో ప్రగ్యా పాత్రకు పెద్దగా స్కోప్ ఇచ్చినట్టు కనిపించలేదు. అయితే ఇదిలా ఉండగా.. బాలయ్య – బోయపాటి శ్రీను (Boyapati sreenu) కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 లో కూడా ప్రగ్యా నే హీరోయిన్గా నటిస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.


ప్రగ్యా జైస్వాల్ కి బదులు సంయుక్త మీనన్..

ఇక అందరూ కూడా బాలయ్యకు ప్రగ్యా జైస్వాల్ లక్కీ లేడీగా మారిపోయిందని, అందుకే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఈమెనే హీరోయిన్గా తీసుకోబోతున్నారు అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అఖండ 2 నుండి ప్రగ్యా జైస్వాల్ ను తప్పించినట్లు సమాచారం. ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. ప్రగ్యా స్థానంలో గోల్డెన్ యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha menon) ను తీసుకున్నారు. అంతేకాదు అఖండ -2 సెట్ లోకి సంయుక్త మీనన్ కు ఆహ్వానం పలుకుతూ.. పోస్టర్ని రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ విషయం కాస్త చాలా వైరల్ గా మారుతోంది.


ప్రగ్యాను తప్పించడానికి అదే కారణం..

ఇకపోతే ఇన్ని రోజులు అఖండ 2 లో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటించబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వినిపించాయి. మరి సడన్ గా సంయుక్త మీనన్ ను తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటి ? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అసలు విషయంలోకెళితే, అఖండ 2 కి ముందుగా ప్రగ్నా నే అనుకున్నారు. కానీ డాకు మహారాజ్ సినిమాలో అంతగా చెప్పుకోదగ్గ పాత్ర ఈమెకు ఇవ్వలేదు. పైగా బాలకృష్ణ సలహా మేరకే ఈమెను తీసుకున్నారు. కానీ ప్రత్యేకంగా ఈమె కోసం పాత్రను డిజైన్ చేయలేదట డైరెక్టర్. అంతే కాదు ఈ సినిమా కోసం రూ .1.2కోట్ల పారితోషకం కూడా తీసుకుంది. ఇక ప్రస్తుతం ఈమెకు స్కోప్ ఉన్న పాత్రలు లేకపోవడం వల్లే ఈమెను తీసేసి సంయుక్త మీనన్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సినిమా ఆటోగ్రాఫర్ గా సి. రాంప్రసాద్, సమీర్ రెడ్డి ని తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా వీరు కెమెరామెన్ గా పనిచేసిన ప్రతి సినిమా కూడా 100% రిజల్ట్ ను అందించింది.దీంతో అప్పుడే అఖండ 2 బ్లాక్ బస్టర్ అని అభిమానులు అప్పుడే కామెంట్లు చేస్తున్నారు.

బాలకృష్ణ సినిమాలు..

బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి హిట్ కాంబోలను రిపీట్ చేస్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే డాకు మహారాజ్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ బాబీ తో మరో సినిమా , గతంలో వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయాన్ని అందించిన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా, అలాగే రజినీకాంత్ జైలర్ 2 లో కూడా గెస్ట్ పాత్ర పోషించబోతున్నారు.. ఏది ఏమైనా బాలయ్య వరుస లైనప్ లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×