E-Paper
Advertisement

కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు మృతి!

కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు మృతి!
Advertisement

Krishna River: పల్నాడు జిల్లాలోని కోనూరు గ్రామం వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్ర కోసం సరదాగా బయలుదేరిన పదిమంది బంధువుల కుటుంబంలో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. పదిమంది కలిసి ఒక పడవలో నదిలోకి విహారయాత్రకు వెళ్లారు. అయితే, తిరిగి వస్తున్న సమయంలో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో వారంతా నదిలో మునిగిపోయారు.

ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రాణాలకు తెగించి నదిలోకి దూకారు. తమవంతు ప్రయత్నంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నీటిలో మునిగిపోయిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు . ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మునిగిపోయిన పడవ సాంకేతిక లోపంతో బోల్తా పడిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురక్షితంగా బయటపడిన ఆరుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

also read: వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×