E-Paper
Advertisement

బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం: 10 రోజుల్లో రూ. 378 కోట్ల కలెక్షన్లు!

బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ ప్రభంజనం: 10 రోజుల్లో రూ. 378 కోట్ల కలెక్షన్లు!
Advertisement

Peddi Collections: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 378 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, 2026 లో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది.

Read also-Amaravati: అమరావతి.. సారీ బ్రో- ఆ పనులు ఆగలేదు, ఆపై మంత్రి లోకేష్ వీడియో విడుదల

Advertisement

కలెక్షన్ల వివరాలు

రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద తన పట్టును నిరూపించుకుంది. 10వ రోజు (రెండో శనివారం) ఈ చిత్రం ఇండియాలో ఊహించని రేంజ్‌లో పుంజుకుని, రూ. 8.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే ఏకంగా 57.3% వృద్ధి. దీనితో భారతదేశంలో మొత్తం 10 రోజుల కలెక్షన్లు రూ. 206.80 కోట్ల నెట్‌కు (గ్రాస్ పరంగా రూ. 245.53 కోట్లు) చేరాయి. ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా రూ. 51 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో కలిపి ఈ చిత్రం రూ. 375 కోట్ల మార్కును సులువుగా దాటేసింది.

Advertisement

రామ్ చరణ్ కెరీర్‌లో సరికొత్త మైలురాయి

‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో రామ్ చరణ్‌కు ఈ సక్సెస్ చాలా కీలకంగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ కెరీర్‌లో డొమెస్టిక్ మార్కెట్‌లో రూ. 200 కోట్ల నెట్ మార్కును దాటిన రెండో సినిమా ఇది. సోలో హీరోగా ఆయనకు ఇదే మొదటి డబుల్ సెంచరీ కావడం విశేషం.

Read also-ప్రపంచంలో ఫస్ట్ ట్రిలియనీర్‌.. ఎలాన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు, ఆ ఇల్లు వెనుక ఏం జరిగింది?

సినిమా భారీ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన విధానంపై ప్రేక్షకుల నుండి కొంత విమర్శలు వచ్చాయి. కొన్ని కెమెరా యాంగిల్స్ వల్ల ఆమె పాత్రను మరీ ఎక్కువగా గ్లామరైజ్ (హైపర్‌సెక్సువలైజ్) చేశారనే నెగటివ్ టాక్ వినిపించింది. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందిస్తూ.. “ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ప్రేక్షకులకు నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెబుతున్నాను. థియేటర్లలో ఉన్న ఆ వివాదాస్పద షాట్లను తొలగిస్తున్నాము” అని ప్రకటించారు. విజయనగరం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×