Maharashtra News : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వింతైనా కిడ్నాప్ కేసు నమోదైంది. ఒకే ప్రాంతంలో ఉంటున్న ఇద్దరు పరారైనట్లుగా పోలీసులు కేసు నమోదు కాగా.. అందులో పారిపోయిన అబ్బాయి 11వ తరగతి విద్యార్థి. ఇక అతన్ని తీసుకుని పారిపోయిన మహిళ వయస్సు 36 ఏళ్లు కావడం విశేషం. పైగా.. ఈమె ముగ్గురు పిల్లలకు తల్లి కావడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. ఈ వింత ఘటనపై అబ్బాయి తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసుల దగ్గరకు వెళ్లగా, వారు కేసు నమోదు చేసుకుని వారిని గాలించి పట్టుకున్నారు.
పారిపోయిన బాలుడు నివసించే ప్రాంతానికి కొద్ది దూరంలోనే ఉండే వివాహిత మహిళ.. తరచు ఓ ఆలయానికి వెళుతుంటుంది. అక్కడికి తండ్రితో పాటుగా వెళ్లిన కుర్రాడు.. ఓ సందర్భంలో తన తండ్రి మాట్లాడడం ద్వారా పరిచయం ఏర్పరుచుకున్నాడు. తమ కుమార్తె ఆరోగ్యం విషయమై.. కుర్రాడి తండ్రి ఆ మహిళతో మాట్లాడారు. అప్పుడే తొలిసారి.. పరిచయం అయిన మహిళా, పారిపోయిన కుర్రాడు.. ఆ తర్వాత తరచూ మాట్లాడుకుంటూ ఉండే వాళ్లు. అలా క్రమంగా వారిద్దరి మధ్య బంధం బలపడింది. కుర్రాడిని తమ మాటలతో దగ్గర చేసుకున్న మహిళ.. అతనితో సాన్నిహిత్యం పెంచుకుంది.
వీరిద్దరి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని గమనించిన బాలుడు తండ్రి.. వారిని అనేక సార్లు వారించాడు. వారిని ఒకరితో ఒకళ్లు కలువకుండా అడ్డుకున్నాడు. అయినా.. బాలుడితో సాన్నిహిత్యాన్ని మరింత పెంచుకున్న మహిళ అతని మనసును పూర్తిగా మార్చేసింది. ఆమె మాయలో పడిన బాలుడు.. ఆమెను కలుసుకోకుండా ఉండలేకపోయాడు. దాంతో.. బాధిత బాలుడిని మహిళకు దూరంగా ఉంచేందుకు ఓల్డ్ మంగళ్వాడిలోని బంధువుల ఇంటికి పంపించేశారు. ఇలా.. అతన్ని నిరోధించడాన్ని భరించలేని కుర్రాడు.. ఆ మహిళతో పారిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే ఓ రోజు ఎవరికి చెప్పాపెట్టకుండ.. ఇంట్లో నుంచి పారిపోయాడు. అప్పటికే.. మహిళకు పెళ్లై, ముగ్గురు పిల్లులు కూడా ఉన్నారు.
బాలుడి ఆచూకీ కనిపించకపోయే వరకు కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు అన్ని ప్రాంతాల్లో వెతుకులాట సాగించారు. అనేక ప్రాంతాల్లో చూసి.. చివరికి పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దాంతో.. తల్లిదండ్రుల ఫిర్యాదుతో లకాడ్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బాధిత కుర్రాడు 11వ తరగతి కావడం.. అతని వయస్సు 16 ఏళ్లే కావడంతో మహిళపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడిని ఎత్తుకెళ్లిన సెక్షన్లు నమోదు చేశారు. మరోవైపు పారిపోయిన మహిళ కుటుంబం కూడా మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. బాధితుల్లో మైనర్ బాలుడు ఉండడంతో.. ఈ కేసును యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి బదిలీ చేశారు.
Also Read : shocking incident : మనవడి చితిలో దూకి ఆత్మహత్య చేసుకున్న తాత – వీరికి ముందే మరో మరణం
బాలుడు, మహిళ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. చివరికి వారిద్దరి గుర్తించారు. కుర్రాడిని చివరికి కుటుంబ సభ్యుల దరికి చేర్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు, బాలుడికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న మహిళను లకాడ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఆమెను న్యాయస్థానం ముందు హాజరుపరచగా.. కోర్టు ఆ మహిళకు బెయిల్ మంజూరు చేసింది.