BEL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.
ప్రభుత్వం రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), బెంగళూరు లో కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు 7 వెకెన్సీ ఉన్నాయి.
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 10 (అంటే రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. )
దరఖాస్తు విధానం: అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా (ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్)లో పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 ఫిబ్రవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30000 నుంచి రూ.1,20,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
చిరునామా: Asst. Engineer E-I Grade and addressed to Sr. Dy. Gen. Manager (HR&A), Bharat
Electronics Limited, KOTDWARA చిరునామాకి దరఖాస్తు పంపాలి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30000 నుంచి రూ.1,20,000 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 7
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 10
జీత: రూ.30000 నుంచి రూ.1,20,000