E-Paper
Advertisement

Asia Flight Disruption: 7 దేశాల్లో విమానాల అంతరాయం, నరకం చూసిన వేలాది మంది ప్రయాణికులు!

Asia Flight Disruption: 7 దేశాల్లో విమానాల అంతరాయం, నరకం చూసిన వేలాది మంది ప్రయాణికులు!

Massive Flight Disruptions Hit Asia: విమాన ప్రయాణీకులు మరోసారి నరకం చూశారు. రీసెంట్ గా ఇండిగో ఆపరేషనల్ ఫెయిల్యూర్స్ తో భారతీయ విమాన ప్రయాణీకులు రోజుల తరబడి అవస్థలు పడగా, తాజాగా ఏకంగా ఏడు దేశాల ప్రజలు నరకయాతన అనుభవించారు. ఆసియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో విమాన ప్రయాణాలకు భారీగా అంతరాయం ఏర్పడింది. థాయ్ లాండ్, జపాన్, సింగపూర్, ఇండియా, మలేషియా, యుఏఈ, ఖతార్ దేశాల్లో ఏకంగా 134 విమానాలు రద్దయ్యాయి. మరో 2,186 విమానాలు డిలే అయ్యాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది ప్రయాణికులకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది.

కీలక విమానాశ్రయాల్లో గందరగోళం

ప్రత్యేకంగా టోక్యో, బ్యాంకాక్, దుబాయ్ లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. కొందరు కనెక్టింగ్ ఫ్లైట్లను మిస్ చేసుకోగా, మరికొంత మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది.

ప్రముఖ ఎయిర్ లైన్స్ పై తీవ్ర ప్రభావం

ఈ అంతరాయం కారణంగా పలు ప్రముఖ ఎయిర్‌ లైన్స్ కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ముఖ్యంగా ఎయిర్ ఏషియా, జపాన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా, మలేషియా ఎయిర్ లైన్స్ సహా పలు కీలక విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. విమానాల ఆలస్యాలు, రద్దులు పెరగడంతో సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరిగింది.

ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది?

ఏడు దేశాల్లో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, ఆలస్యానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు కాగా, కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. మరికొన్ని ఎమర్జెన్సీ కారణాలు ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, కచ్చితమైన వివరాలు మాత్రం వెల్లడించలేదు. విమాన ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు వచ్చే ముందు విమానాల వివరాలను చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరం అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

గ్లోబల్ ఎయిర్ ట్రావెల్ పై తీవ్ర ప్రభావం

పెద్ద మొత్తంలో విమానాలు రద్ద, ఆలస్యం ప్రభావం ఎలా ఉంటుందో.. గ్లోబల్ ఎయిర్ ట్రావెల్‌పై ఎంతటి ప్రభావం చూపుతుందో మరోసారి స్పష్టమైంది. ఒక ప్రాంతంలో ఏర్పడిన సమస్యలు అనేక దేశాలపై ప్రభావం చూపడంతో పాటు, ప్రయాణికుల ప్రణాళికలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం, ఎయిర్‌లైన్స్ సూచనలు పాటించడం అత్యంత అవసరమని అధికారులు సూచిస్తున్నారు. కొద్ది వారాల క్రితం ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ కారణంగా సరైన సిబ్బంది లేకపోవడంతో ఇండిగో విమానయాన సంస్ చేతులు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో రోజుల తరబడి వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఫలితంగా లక్షలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

Read Also: ఈ దేశం వారంలో 3 రోజులు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోజులు మాయం.. ఎందుకంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×