E-Paper
Advertisement

మల్కాజిగిరిలో ఘోరం.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త!

మల్కాజిగిరిలో ఘోరం.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త!
Advertisement

Malkajgiri: మల్కాజిగిరిలో తెల్లవారుజామున ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య నడుస్తున్న కుటుంబ కలహాలు చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనుమానం, కోపంతో ఊగిపోయిన భర్త, ఏకంగా తుపాకీతో కాల్చి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిషారాణి, అరుణ్ దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున ‘మనం ఒకసారి మాట్లాడుకుందాం, రా’ అని అరుణ్ తన భార్యను పిలిచాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి మళ్లీ గొడవ పెద్దదైంది. ఆవేశం ఆపుకోలేకపోయిన అరుణ్, తన వద్ద ఉన్న గన్‌ తీసి నిషారాణిపై తూటాల వర్షం కురిపించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

Advertisement

అయితే ఈ ఘాతుకానికి అరుణ్ ఒక్కడే పాల్పడలేదు. అతనికి మరో వ్యక్తి కూడా సహకరించినట్లు విచారణలో తేలింది. నిందితుడికి ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇక్కడ గమనార్హం ఏంటంటే.. నిందితుడు అరుణ్‌కు నేర చరిత్ర ఉంది. గతంలో హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో కూడా ఇతను తుపాకీతో హల్‌చల్ చేసి, స్థానికులను భయాందోళనలకు గురిచేశాడు. అప్పట్లోనే అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. పాత నేరస్తుడైన అరుణ్, ఇప్పుడు ఏకంగా భార్యను చంపడానికి తెగబడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటనా స్థలానికి చేరుకున్న మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడితో పాటు అతనికి సహకరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Advertisement

Also Read: తెలంగాణను ‘స్కిల్ క్యాపిటల్’గా మార్చడమే లక్ష్యం.. FTCCI వేడుకల్లో శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×