E-Paper

రోజూ తినే ఈ ఫుడ్స్ వల్లే లివర్ డ్యామేజ్.. సమయం ఉండగానే ఫ్యాటీలివర్ ప్రమాదాన్ని గుర్తించండి

రోజూ తినే ఈ ఫుడ్స్ వల్లే లివర్ డ్యామేజ్.. సమయం ఉండగానే ఫ్యాటీలివర్ ప్రమాదాన్ని గుర్తించండి

ఫ్యాటీ లివర్ ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న ఆరోగ్య సమస్యగా మారింది. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామందికి ఈ సమస్య ఉన్న విషయం కూడా తెలియదు. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. కాలేయం మన శరీరంలో ఆహార జీర్ణక్రియ, విషపదార్థాలు, మలినాల తొలగింపు, ఎనర్జీ బ్యాలెన్స్ వంటి అనేక ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. అయితే తప్పుడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందరూ రోజూ తినే కొన్ని ఆహారాలు నెమ్మదిగా లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు.

షుగర్ డ్రింక్స్ లివర్‌లో కొవ్వు పేరుకుపోవడానికి కారణం

సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూసుల్లో అధిక మోతాదులో చక్కెర ఉంటుంది. కొన్ని ఉత్పత్తుల్లో హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కూడా కలుపుతారు. శరీరానికి అవసరానికి మించిన చక్కెర కొవ్వుగా మారి కాలేయంలో నిల్వ అయ్యే అవకాశం ఉంది. తరచుగా ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరగవచ్చు.

ఫ్రైడ్ ఫుడ్స్ తింటే కాలేయంపై అదనపు భారం

సమోసా, పకోడీ, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వేయించిన ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా అధికంగా ఉంటాయి. శరీరం ఈ అదనపు కొవ్వును పూర్తిగా ఖర్చు చేయలేకపోతే అది కాలేయంలో నిల్వ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని పరిమితంగా తీసుకోవడం మంచిది.

జంక్ ఫుడ్‌లో పోషకాలు తక్కువ

బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్ స్నాక్స్ వంటి జంక్ ఫుడ్‌లో పోషకాలు తక్కువ పోషకాలు ఉంటాయి. అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్, ఇన్సులిన్ సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరగవచ్చు.

తీపి పదార్థాలను ఎక్కువగా తినడం మంచిది కాదు

కేకులు, పేస్ట్రీలు, చాక్లెట్లు, క్యాండీలు వంటి తీపి పదార్థాల్లో రిఫైన్డ్ షుగర్ అధికంగా ఉంటుంది. అవసరానికి మించిన చక్కెర.. శరీరంలో ఎనర్జీ ఉపయోగించబడకుండా వ్యర్థంగా ఉండిపోతుంది. ఈ ఎనర్జీ కొవ్వుగా మారి కాలేయంలో నిల్వ కావచ్చు. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.

మద్యం కాలేయానికి ప్రధాన శత్రువు

మద్యం సేవించడం లివర్ కణాలను దెబ్బతీసే ప్రధాన కారణాల్లో ఒకటి. తరచుగా మద్యం తాగడం వల్ల కాలేయ పనితీరు తగ్గిపోవచ్చు.
ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. చిన్న మోతాదులో తీసుకున్నా కొంతమందిలో పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

ప్రాసెస్డ్ ఫుడ్ కూడా ప్రమాదాన్ని పెంచుతుంది

రెడీ టు ఈట్ భోజనాలు, ప్యాకెట్ సూప్‌లు, సాసేజ్‌లు, బేకన్ వంటి ప్రాసెస్డ్ ఆహారాల్లో కృత్రిమ పదార్థాలు, ప్రిజర్వేటివ్స్ అధిక ఉప్పు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

Also Read: భగవాన్ విష్ణుకు చెందిన 25 పేర్లతో మీ బిడ్డకు ప్రత్యేక గుర్తింపు.. వీటి అర్థాలు తెలుసా

ఆరోగ్యకరమైన జీవనశైలితో పరిష్కారం

సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నీరు తాగడం, తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించాలంటే రోజువారీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. లక్షణాలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం బెస్ట్.

Related News

తలనొప్పితో జీవితం నరకంగా మారిందా? ఆ ఒక్క పొరపాటే ముఖ్య కారణం!

గ్యాస్,అసిడిటీ టాబ్లెట్లు వాడుతున్నారా? కిడ్నీలు, లివర్ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం

వర్షాకాలానికి ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి.. చర్మం, జుట్టు మెరిసిపోవడం ఖాయం!

టాబ్లెట్లతో పనిలేకుండా షుగర్ కంట్రోల్.. రోజును ఈ డ్రింక్స్‌తో స్టార్ట్ చేస్తే చాలు!

గంటల పని నిమిషాల్లో.. ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండాల్సిన మ్యాజికల్ గ్యాడ్జెట్స్!

దాంపత్య జీవితాన్ని సంతోషంగా మార్చే సులభమైన నియమాలు.. ఈ సీక్రెట్స్ మీకు తెలుసా?

ఎక్కువగా ఆలోచిస్తూ రాత్రి నిద్ర పట్టడం లేదా? టాబ్లెట్స్ లేకుండా ప్రశాంతమైన నిద్ర కోసం ఇలా చేయండి

వేసవిలో వాటర్ పార్క్‌కు వెళుతున్నారా? ఈ తప్పులు చేస్తే మీ ట్రిప్ నాశనమే

×