108 Ambulance: టెక్నాలజీ పుణ్యమా అని ట్రెండ్‌కు తగ్గట్టుగా మారిపోతున్నారు. వ్యక్తులు మాత్రమే కాదు.. చివరకు దొంగలు సైతం రూటు మార్చేశారు. హైదరాబాద్‌లో ఓ దొంగ ఏకంగా అంబులెన్స్‌ను దొంగలించాడు. ఆ తర్వాత హైవే రోడ్డుపై యాక్షన్ సీన్స్ తరహాలో బీభత్సం చేశాడు. చివరకు ఎలా చిక్కాడని తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్కేద్దాం.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్ నగర్‌లో 108 వాహనం దొంగిలించాడు ఓ దొంగ. అయితే ఆ వాహనాన్ని ఏం చెయ్యాలో తికమకపడ్డాడు. లైట్‌గా డ్రైవింగ్ రావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఎక్కేశాడు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతి వేగంతో విజయవాడ వైపు పోనిచ్చాడు. ఓ వైపు వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ మరోవైపు కన్ఫ్యూజన్‌లో పడ్డాడు.
పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ కావడంతో ఏం చేయాలన్న టెన్షన్ మరోవైపు దొంగను వెంటాడింది. చిట్యాల వద్ద అంబులెన్స్‌ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అక్కడ ఓ వ్యక్తిని ఢీ కొట్టాడు. ఆ తర్వాత కొర్లపహాడ్ టోల్ ప్లాజాను ఢీకొట్టి వేగంగా పోనిచ్చాడు ఆ దొంగ. ఎట్టకేలకు టేకుమట్ల స్టేజ్ వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి అంబులెన్స్‌ను ఆపారు పోలీసులు.
అంబులెన్స్‌తోపాటు దొంగను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో పేషెంట్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ఇంటరాగేషన్ చేయడంతో వాహనం ఎక్కడ దొంగిలించాననేది గుట్టు బయటపెట్టాడు.
ALSO READ: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, చెరువులో దూసుకెళ్లిన కారు
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్‌లో చోరీ చేసినట్టు తెలిపాడు. నిందితుడిపై గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయి. అంబులెన్స్ ఢీ కొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రీట్ మెంట్ నిమిత్తం అతడ్ని హైదరాబాద్‌కు తరలించారు.
హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ.. దొంగ హల్చల్
హైదరాబాద్‌లో అంబులెన్స్ చోరీ చేసి దొంగ హల్చల్ చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అంబులెన్స్ చోరీ చేసిన వ్యక్తిని పోలీసులు సూర్యాపేట వరకు వెంబడించి పట్టుకున్నారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై సినిమా తరహాలో పోలీసులు ఛేజింగ్ చేశారు.… pic.twitter.com/rTKxCPdia4
— ChotaNews (@ChotaNewsTelugu) December 7, 2024